నేడే మున్సిప‌ల్ ఎన్నిక‌లు.. వారంద‌రికీ గుడ్ న్యూస్‌

by velandi.Saikiran |   (  Updated:2026-02-11 02:38:50  IST  )

ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్ క్యాజువల్ లీవ్ కూడా మంజూరు చేసింది సర్కార్. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

నేడే మున్సిప‌ల్ ఎన్నిక‌లు.. వారంద‌రికీ గుడ్ న్యూస్‌
X

దిశ‌, వెబ్ డెస్క్‌: తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మున్సిపల్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. నిన్నటి వరకు పోల్ మేనేజ్మెంట్ చేసిన అభ్యర్థులు.. ఇవాళ ఓటర్లను పోలింగ్ కేంద్రాల దాకా తీసుకువచ్చి... ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రయత్నాలు చేయనున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది.

ఇవాళ వాళ్లందరికీ వేతనంతో కూడిన సెలవు

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఇవ్వాల జరగనున్న నేపథ్యంలో గుడ్ న్యూస్ చెప్పింది సర్కార్. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కార్మిక శాఖ వేతనంతో కూడిన సెలవు ప్రకటించేసింది. పోలింగ్ జరిగే ప్రాంతాల్లోని ఫ్యాక్టరీలు, దుకాణాలు, ప్రైవేట్ సంస్థల ఉద్యోగులకు ఇది వర్తిస్తుందని కూడా అధికారిక ఉత్తర్వులలో పేర్కొంది కార్మిక శాఖ. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఉండే ప్రభుత్వ ఆఫీసులు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు ఇప్పటికే హాలిడే ప్రకటించారు.

అటు ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్ క్యాజువల్ లీవ్ కూడా మంజూరు చేసింది సర్కార్. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఇది ఇలా ఉండగా ఇవాళ 7 గంటలకు తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమవుతుంది. సాయంత్రం ఐదు గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగనుంది. మొత్తం 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్ల పరిధిలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికలలో మొత్తం 12, 944 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

ఓటుకు వేళాయే.. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు

Next Story