హన్మకొండ ఊర చెరువుకు గండి.. నీట మునిగిన కాలనీలు

by Malleboina Mahesh |   (  Updated:2025-10-30 04:32:47  IST  )

మొంథా తుపాను కారణంగా తెలంగాణలోని వరంగల్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు కుండపోత వర్షాలు కురిశాయి.

హన్మకొండ ఊర చెరువుకు గండి.. నీట మునిగిన కాలనీలు
X

దిశ, వెబ్ డెస్క్: మొంథా తుపాను కారణంగా తెలంగాణలోని వరంగల్ జిల్లా (Warangal District)లో భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy rains) కురిశాయి. ముఖ్యంగా మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు కుండపోత వర్షాలు కురిశాయి. దీంతో వాగులు వంకలు పొంగిపోర్లుతున్నాయి. ఎవరూ ఊహించని విధంగా వరంగల్ జిల్లాల్లో అత్యధికంగా 40 సెం. మీ లకు పైగా వర్షపాతం నమోదు అయింది. దీంతో హన్మకొండ (Hanmakonda)లోని ఊర చెరువుకు (Ooracheruvu) ఒక్కసారిగా వరద పోటెత్తడంతో గండి (Gandy) పడింది. ఒక్కసారిగా భారీ వరద ఊర చెరువునుంచి పొంగి పోర్లడంతో.. భయభ్రాంతులకు గురైన ప్రజలు ఇళ్ల డాబాలపై కి చేరుకున్నారు.

వరద కారణంగా ప్రస్తుతం 100 ఫీట్ రోడ్, వివేక్ నగర్, ప్రగతి నగర్, సమ్మయ్య నగర్, టీఎన్జీవో కాలనీ వరదలో చిక్కుకున్నాయి. ఈ సమాచారం అందుకున్న అధికారులు జేసీబీల సహాయంతో కాలనీ వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రస్తుతం హన్మకొండలోని ఊర చెరువు ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను యుద్ధ ప్రాతిపదికన కొనసాగిస్తున్నారు. ఇందులో నగర పోలీసులు, డీఆర్ఎఫ్ సిబ్బంది, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

Read More..

పొంగి పొర్లుతున్న ఊరచెరువు.. ఆ మార్గాల్లో రాకపోకలు బంద్

తుపాను తీరం దాటిన రాష్ట్రాన్ని వదలను వరుణుడు.. ఈ జిల్లాలో కుండపోత వర్షాలు

Next Story