- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తుపాను తీరం దాటిన రాష్ట్రాన్ని వదలను వరుణుడు.. ఈ జిల్లాలో కుండపోత వర్షాలు
బంగాళఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను కారణంగా ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అయింది. మంగళవారం రాత్రి 12. 30 గంటలకు ఈ తీవ్ర తుపాను తీరం దాటినప్పటికీ.. వర్షాలు మాత్రం తగ్గడం లేదు.

దిశ, వెబ్ డెస్క్: బంగాళఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను కారణంగా ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అయింది. మంగళవారం రాత్రి 12. 30 గంటలకు ఈ తీవ్ర తుపాను తీరం దాటినప్పటికీ.. వర్షాలు మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మరల తీవ్రమవుతున్నాయి. ఇప్పటికే ఎంతో ప్రభావం చూపిన మోంథా తుఫాన్ ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. తుపాన్ బలహీనపడి లోతైన ఆవర్తనంగా మారడంతో భారీ వర్షాల కురుస్తున్నాయి. ముఖ్యంగా తూర్పు గోదావరి నుంచి శ్రీకాకుళం వరకు తీర ప్రాంతం మొత్తం కుండపోత వర్షాలతో నిండిపోయింది.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి జిల్లాలో రాత్రి పొడవునా వర్షాలు కురిశాయి. ఎడతెరిపి లేని వానతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. రహదారులు దెబ్బతిన్నాయి, ట్రాఫిక్ నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం కలిగింది. అలాగే విజయనగరం జిల్లా గరభం, బొబ్బిలి, నర్సీపట్నం పరిసరాల్లో వానలు కొనసాగుతుండగా, శ్రీకాకుళం తీర ప్రాంతంలో సముద్రం ఉద్ధృతంగా ఎగిసిపడుతోంది.
మత్స్యకారులు సముద్రానికి వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. వాతావరణ శాఖ తాజా బులెటిన్ ప్రకారం, మోంథా తుఫాన్ మిగతా తేమ ప్రభావం వల్ల మరో రెండు రోజులు వర్షాలు కొనసాగనున్నాయి. తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే బయటకు వెళ్లకూడదని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ, పంచాయతీ, విద్యుత్, విపత్తు నిర్వహణ శాఖలు అత్యవసర చర్యల్లో నిమగ్నమయ్యాయి. తుపాన్ దెబ్బకు పంటలు నష్టపోయిన రైతులకు సాయం అందించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.






