పొంగి పొర్లుతున్న ఊరచెరువు.. ఆ మార్గాల్లో రాకపోకలు బంద్

by Jakkula.Mamatha |

భారీ వర్షాలకు వరంగల్ నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది.

పొంగి పొర్లుతున్న ఊరచెరువు.. ఆ మార్గాల్లో రాకపోకలు బంద్
X

దిశ, వరంగల్ బ్యూరో: భారీ వర్షాలకు వరంగల్ నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. వరంగల్ హనుమకొండను అనుసంధానం చేసే హంటర్ రోడ్డు లో బొంది వాగు ఉప్పొంగడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ములుగు రోడ్డు వద్ద నాలా ఉధృతంగా ప్రవహించడంతో వరంగల్ హనుమకొండకు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి . హన్మకొండలోని ఊర చెరువు తెగడంతో సంతోషిమాత కాలనీ , డీకే నగర్, ఎన్ఎన్ నగర్ ,మైసయ్య నగర్, సమ్మయ్య నగర్, సంతోషి మాత కాలనీ, సాయి గణేష్ కాలనీ లోని ఇళ్లలోకి వరద నీరు ప్రవహించడంతో కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు.

వరంగల్ తూర్పు లో ఆరు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ముంపు ప్రాంతాల వాసులను పడవల సహాయంతో పునరావాస కేంద్రాలకు తరలించారు. హనుమకొండలోని ప్రగతి నగర్ వివేక్ నగర్ 100 ఫీట్ రోడ్ కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. తెల్లవారుజామున 4:30 నుండి ఇళ్లలోనే బిక్కుబిక్కుమంటూ ప్రజలు గడుపుతున్నారు. కరెంటు లేక వాటర్ లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కనీసం ఎవరు పట్టించుకోవడం లేదంటూ కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ప్రాకాలేన్ల ద్వారా పలు చోట్ల నాలలు టెంపుతూ వరద నీటిని తరలిస్తున్నారు.

Next Story