కొనసాగుతోన్న పంచాయతీ ఎన్నికల పోలింగ్.. ఉదయం 9 వరకు 22.54 శాతం పోలింగ్ నమోదు

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-14 07:55:00  IST  )

రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది.

కొనసాగుతోన్న పంచాయతీ ఎన్నికల పోలింగ్.. ఉదయం 9 వరకు 22.54 శాతం పోలింగ్ నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా.. 9 గంటల వరకు 22.54 శాతం పోలింగ్‌ నమోదైనట్లుగా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేశారు. అదేవిధంగా ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ ముగుస్తుందని.. ఆ లోపు పోలింగ్ కేంద్రం పరిధిలో ఉన్న ఓటర్లకు ఓటేసే అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే పలు గ్రామాల్లో ఓటేసేందుకు ఓటర్లు బారులు తీరారు.

కాగా, చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడతన పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగానే కొనసాగుతోంది. నాగర్‌కర్నూల్‌ జిల్లా తిమ్మాజిపేట మండల పరిధిలోని అవంచ గ్రామంలో బీఆర్‌ఎస్‌ నాయకుల మధ్య విబేధాలు చెలరేగాయి. ఒకరిపై ఒకరు దాడికి పాల్పడగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు మహబూబాబాద్‌ జిల్లా తొర్రూర్‌లోనూ స్వల్ప ఘర్షణ జరిగింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా పక్క గ్రామాల వారు తమ గ్రామంలోకి వచ్చి ప్రచారం చేస్తున్నారంటూ బీఆర్‌ఎస్‌ నేతలు అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

READ MORE ...

ముగిసిన రెండో విడత పోలింగ్.. ఫలితాలపై నరాలు తెగే ఉత్కంఠ

Next Story