- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కట్టిన ఓటర్లు.. మొదటి 2 గంటల్లోనే 18.37శాతం పోలింగ్ నమోదు
రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ శరవేగంగా కొనసాగుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూ కట్టారు. రాష్ట్ర ఎన్నికల సంఘం సమాచారం మేరకు మొదటి రెండు గంటల్లో ఉదయం 9 గంటల వరకు 18.37 శాతం పోలింగ్ నమోదైనట్లుగా తెలిపారు. మొత్తం 35,26,266 మంది ఓటర్లలో ఇప్పటి వరకు 6,47,879 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మహబూబాబాద్ (Mahbubabad) జిల్లాలో అత్యధికంగా 28.87 శాతం పోలింగ్ నమోదైంది, ఇక్కడ మొత్తం 30,781 మంది ఓటర్లలో 8,885 మంది ఓటు వేశారు. సూర్యాపేట జిల్లా 26.43 శాతంతో రెండో స్థానంలో ఉంది, అక్కడ 1,14,130 మంది ఓటర్లలో 30,165 మంది పాల్గొన్నారు. సిద్దిపేట 24.06 శాతం, ఖమ్మం 23.77శాతం, జోగులంబ గద్వాల్22.26శాతంతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
కాగా, మరోవైపు కొమరం భీమ్ అసిఫాబాద్ (Komaram Bheem Asifabad) జిల్లాలో అతి తక్కువగా 7.85 శాతం మాత్రమే పోలింగ్ జరిగింది. అక్కడ 1,01,287 మంది ఓటర్లలో కేవలం 7,954 మంది మాత్రమే ఓటు వేశారు. ఆదిలాబాద్ 8.97 శాతం, భద్రాద్రి కొత్తగూడెం 12.72శాతం, ములుగు 13.31 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనుందని ఇప్పటికే ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే.
Read More..
బూర్గంపాడు పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత
పంచాయతీ ఎన్నికల వేళ ఉద్రిక్తత.. కొర్లపహాడ్‌లో కాంగ్రెస్, BRS శ్రేణుల తోపులాట






