పంచాయతీ ఎన్నికల వేళ ఉద్రిక్తత.. కొర్లపహాడ్‌లో కాంగ్రెస్, BRS శ్రేణుల తోపులాట

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-11 02:26:49  IST  )

రాష్ట్ర వ్యాప్తంగా తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది.

పంచాయతీ ఎన్నికల వేళ ఉద్రిక్తత.. కొర్లపహాడ్‌లో కాంగ్రెస్, BRS శ్రేణుల తోపులాట
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే పలు గ్రామాల్లో వర్గాలుగా విడిపోయి ప్రజలు ఘర్షణకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే నారాయణపేట జిల్లా కోస్గి మండల పరిధిలోని సర్జఖాన్‌పేట్‌ (Sarjakhanpet)లో సర్పంచ్ ఎన్నికల వేళ డబ్బు, మద్యం పంచుతున్నారని ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని చెదరగొట్టి పరిస్థితిని సద్దుమణిగేలా చేశారు.

ఇక ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల పరిధిలోని కొండవనమాల (Kondavanamala)లో అర్ధరాత్రి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఇంటికి ఆగంతకులు నిప్పు పెట్టారు. గమనించిన స్థానికులు మంటలను ఆర్పడంతో ప్రాణ నష్టం తప్పింది. రాజకీయ కక్షతోనే తన ఇంటికి నిప్పు పెట్టారని బాధితుడు వెంకటేశ్వర్లు ఆరోపించారు. మరోవైపు నల్గొండ జిల్లా కేతేపల్లి మండల పరిధిలోని కొర్లపహాడ్‌ (Korlapahad)లో పంచాయతీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ పరస్పర దాడుల్లో పలువురికి గాయాలయ్యాయి. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టడంతో పరిస్థితి యథా స్థితికి వచ్చింది. ఈ పరిణామంతో ఎన్నికల అధికారులు కోర్లపహాడ్ గ్రామంలో భారీగా పోలీసులను మోహరించారు.

Read More..

తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ షురూ.. బరిలో 78,415 మంది అభ్యర్థులు

Next Story