- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ షురూ.. బరిలో 78,415 మంది అభ్యర్థులు
రాష్ట్రంలో తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల (Gram Panchayat Elections) పోలింగ్ ప్రారంభమైంది. ఇందుకు సంబంధించి అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. 3,834 సర్పంచ్, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. 37,562 పోలింగ్ కేంద్రాల్లో 56,19,430 మంది ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకోబోతున్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కించి తుది ఫలితాలను ప్రకటించనున్నారు. ఎన్నికైన వార్డు సభ్యులతో స్పాట్‌లోనే మీటింగ్ నిర్వహించి ఏకాభిప్రాయంతో ఉప సర్పంచ్ ఎన్నికను పూర్తి చేయనున్నారు.
కాగా, తొలి దశలో 4,236 గ్రామపంచాయతీ సర్పంచి పదవులకు 37,440 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో ఐదు సర్పంచి పదవులకు, 169 వార్డు పదవులకు నామినేషన్లు దాఖలు కాలేదు. ఇక 396 సర్పంచి పదవులు, 9,633 వార్డు సభ్యుల స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్, 10 వార్డు స్థానాల ఎన్నికలపై హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. ఇవాల తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 3,834 సర్పంచ్ పదవులకు గాను 12,960 మంది అభ్యర్థులు.. 27,628 వార్డు సభ్యుల స్థానాలకు గాను 65,455 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
తొలిదశ పంచాయతీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సమస్యాత్మకంగా గుర్తించిన 3,461 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ కెమెరాలు ఏర్పాటు చేశారు. 50 వేల మంది సివిల్ పోలీసులు, 60 ప్రత్యేక పోలీసు ప్లటూన్‌లు, రెండు వేల మంది అగ్నిమాపక, అటవీ సిబ్బంది బందోబస్తు విధుల్లో ఉన్నారు. ఓటర్లు నిర్భయంగా, స్వేచ్ఛగా తమ ఓటుహక్కు వినియోగించుకోవాలి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని (SEC Rani Kumudini) పిలుపునిచ్చారు. పోలింగ్ జరిగే గ్రామాల్లో మద్యం దుకాణాలను మూయించామని, స్థానికంగా సెలవు దినంగా ప్రకటించామని అన్నారు. ఏకగ్రీవమైన స్థానాలపై ఎక్కడి నుంచైనా ఫిర్యాదులు వస్తే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఎస్ఈసీ రాణి కుముదిని స్పష్టం చేశారు.
Read More..
పంచాయతీ ఎన్నికలపై ఎమ్మెల్యేల ఫోకస్.. మెజారిటీ స్థానాల్లో గెలుపునకు పావులు






