- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పంచాయతీ ఎన్నికలపై ఎమ్మెల్యేల ఫోకస్.. మెజారిటీ స్థానాల్లో గెలుపునకు పావులు
అధికార పార్టీ ఎమ్మెల్యేలు పంచాయతీ ఎన్నికల ఫోకస్ పెట్టారు.

దిశ, తెలంగాణ బ్యూరో: అధికార పార్టీ ఎమ్మెల్యేలు పంచాయతీ ఎన్నికల ఫోకస్ పెట్టారు. నియోజకవర్గంలో ఎక్కువ సర్పంచ్ స్థానాలను గెలుస్తామా? లేదా? అని టెన్షన్ పడుతున్నారు. తొలి విడతలో ఎన్ని గ్రామాల్లో విజయం సాధిస్తామని ఆరా తీస్తున్నారు. బీఆర్ఎస్ గట్టి పోటీ ఇస్తున్న ఊర్లపై స్పెషల్‌గా ఫోకస్ పెట్టి అక్కడి అభ్యర్థులకు కావాల్సిన ఆర్థిక వనరులను అందిస్తున్నారు. ఒకవేళ ప్రత్యర్థి పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిస్తే వెంటనే సదరు సర్పంచులను పార్టీలోకి చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతున్నది.
ఇజ్జత్ కా సవాల్..
సర్పంచ్ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతున్న ప్రతి గ్రామంలో బరిలో ఉన్న అభ్యర్థులకు ప్రధాన పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి. దీంతో మెజార్టీ స్థానాలను గెలిపించుకోవడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫోకస్ పెట్టారు. ఆశించిన స్థాయిలో సర్పంచ్ స్థానాలు దక్కకపోతే నియోజకవర్గంలో పరువు పోతుందనే టెన్షన్ పట్టుకున్నది. అదే సమయంలో సెగ్మెంట్‌లో ప్రత్యర్థి పార్టీ బలం పుంజుకోడానికి జీజం పడే ప్రమాదనే విషయాలను గ్రహించిన ఎమ్మెల్యేలు అధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. అందుకోసం వారం రోజులుగా నియోజకవర్గంలోనే ఉంటూ పార్టీ బలహీనంగా ఉన్న గ్రామాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఆర్థికంగా బలహీనంగా ఉన్న అభ్యర్థులకు గుట్టుచప్పుడు కాకుండా వనరులను పంపించి గెలుపు కోసం సహాయ సహకారాలు అందిస్తున్నారు.
ప్రత్యర్థి గెలిస్తే కండువా కప్పడమే..
ప్రత్యర్థి పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు గెలిచే గ్రామాలను ముందుగానే ఎమ్మెల్యేలు గుర్తించారు. ఆక్కడ రిజల్ట్ ప్రకటించిన వెంటనే కొత్త సర్పంచులను పార్టీలో చేర్చుకునేందుకు ప్లాన్‌ను సిద్ధం చేశారు. అందుకోసం ఇప్పటికే ఓ టీమ్‌ను ప్రత్యేకంగా రెడీ చేశారు. వీలైతే అదే రోజు లేకపోతే తెల్లారి, మర్నాడు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుకు తీసుకెళ్లి కాంగ్రెస్ కాంగ్రెస్ కండువా కప్పేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తున్నది.
Read More..
తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ షురూ.. బరిలో 78,415 మంది అభ్యర్థులు






