- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరంగల్‌లో సమయం ముగిసినా పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరిన ఓటర్లు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోలింగ్ సమయం ముగిసినా కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు.

దిశ, వెబ్ డెస్క్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోలింగ్ సమయం ముగిసినా కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఉదయం 7గంటలకే పోలింగ్ ప్రారంభం అవ్వగా మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ పూర్తికావాల్సి ఉంది. కానీ చాలా మంది ఓటర్లు బారులు తీరడంతో ఓటింగ్ ఆలస్యం అవుతోంది. దీంతో ఒంటిగంట వరకు పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓటర్లకు అధికారులు ఓటు వేసేందుకు అనుమతి ఇచ్చారు. ప్రస్తుతం లైన్ లో ఉన్న ఓటర్లు ఓటు వేయడానికి సాయంత్రం 5గంటల వరకు సమయం పట్టవచ్చని అధికారులు చెబుతున్నారు. ఇక ఉమ్మడి జిల్లాలో ఒంటిగంట వరకు 84.2శాతం ఓటింగ్ నమోదైనట్టు తెలిపారు. అంతే కాకుండా 10 నుండి 12శాతం ఓటర్లు క్యూలైన్ లోనే ఉన్నారని చెప్పారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో పోలింగ్ పూర్తైంది. అంతే కాకుండా కౌంటింగ్ కూడా ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు.
READ MORE .....






