Sarpanch Election Result: మొదలైన సర్పంచ్ ఎలక్షన్ కౌంటింగ్.. ఫలితాల్లో ఆ పార్టీదే హవా

by Prasad Jukanti |   (  Updated:2025-12-11 09:25:03  IST  )

మొదటి విడత సర్పంచ్ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది.

Sarpanch Election Result: మొదలైన సర్పంచ్ ఎలక్షన్ కౌంటింగ్.. ఫలితాల్లో ఆ పార్టీదే హవా
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ గ్రామపంచాయతీ తొలివిడత ఎన్నికల(Telangana gram panchayat elections) పోలింగ్‌ ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించారు. 1 గంట వరకు పోలింగ్ కేంద్రం క్యూ లైన్ లో ఉన్నవారికి ఓటు వేసేందుకు అనుమతి ఇచ్చారు. పోలింగ్ ముగియడంతో ఫలితాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ (vote counting begins) ప్రారంభమైంది. మరి కాసేపట్లో వార్డు మెంబర్లు, సర్పంచ్ అభ్యర్థుల ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి. మొదటి విడతలో భాగంగా రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో 3,834 సర్పంచ్, 27, 628 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరిగాయి. కాగా ఇప్పటి వరకు మొదటి విడతలో సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన 279 మంది సర్పంచ్ అభ్యర్థులు గెలుపొందగా బీఆర్ఎస్ బలపరిచిన 45 అభ్యర్థులు, బీజేపీ నుంచి 5, ఇతరులు 61 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

READ MORE .....

వరంగల్‌లో సమయం ముగిసినా పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరిన ఓటర్లు

Next Story