ఆ పథకాలు అమలు చేస్తే కాంగ్రెస్ కే ఓటు వేయండి.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

by Taduka Kalyani |   (  Updated:2026-02-08 10:09:58  IST  )

తాండూర్ పురపాలక సంఘం ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచింది

ఆ పథకాలు అమలు చేస్తే కాంగ్రెస్ కే ఓటు వేయండి.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ తాండూర్ టౌన్: తాండూర్ పురపాలక సంఘం ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచింది. ప్రచారంలో భాగంగా ఆదివారం తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పట్లోళ్ల నర్సింలు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తో రోడ్ షో,అనంతరం ఇందిరా చౌక్ కూడలిలో కార్నర్ సమావేశం నిర్వహించారు. ఈ మేరకు తాండూర్ పట్టణ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను, తాండూర్ మున్సిపల్ పరిధిలోని 36 వార్డులకు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థులను ఉద్దేశించి సభాముఖంగా బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాట్లాడుతూ... గత రెండేళ్ల క్రితం ఆరు గ్యారెంటీ పథకాలు అమలు అవుతాయని ఆశతో ఒక్క ఓటు వేసి శిక్ష ఐదేళ్లు అనుభవిస్తున్నారని అన్నారు. ఒక్కసారి మోసంపోతే తప్పిదం అంటారు, రెండోసారి మోసం పోతే తెలివి తక్కువ దద్దమ్మలు అంటారు అని గుర్తు చేశారు. రెండేళ్ల క్రితమే మోసపోయాం మళ్లీ ఇప్పుడు మోసపోకుండా తెలివి ప్రదర్శిస్తూ ముళ్ళును ,ముళ్ళు తోనే తీయాలని సామెత ఎలా ఉందో, మోసమును, మోసంతోనే జయించే అవకాశం మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిందన్నారు. తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆరు గ్యారెంటీల హామీల గాలిలో కొట్టుకొచ్చారని, తిరిగి వెళ్ళిపోయే నాయకుడు అన్నారు. పిలిస్తే పలికే నాయకుడిగా, అందుబాటులో ఉండే యువ నాయకుడు తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తాండూర్ అభివృద్ధికి రూ.1680 కోట్ల నిధులు సమకూర్చి, తాండూర్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేశారన్నారు. కొంతమంది దుష్టశక్తుల కారణంగా 2023 శాసనసభ ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ఓడిపోయినప్పటికీ, అనునిత్యం తాండూర్ ప్రజలకు సేవ చేసుకుంటూ మీతోనే ఉంటూ, కేసీఆర్ నాయకత్వంలో చురుకుగా పాల్గొంటున్నారు. తాండూర్ కు రాబోయే రోజుల్లో తాండూర్ పైలట్ రోహిత్ రెడ్డి అడ్డగా మారుస్తానని ధీమా వ్యక్తం చేశారు.

హామీలు కొండత.. అమలు రవ్వంత

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు 2023 ఎన్నికల్లో ప్రజలను ఆరు గ్యారంటీల అభయహస్తం అరచేతిలో పెట్టుకొని తిరుగుతూ, మాయ మాటలు ప్రసంగిస్తూ, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ గద్దెనెక్కిన సీఎం రేవంత్ రెడ్డి, రెండేళ్ల ప్రజాపాలనలో ఆరు గ్యారెంటీల అమలులో తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి పై ఒత్తిడి తీసుకురావాలని విమర్శించారు. సభాముఖంగా ఒక్క మాట కాంగ్రెస్ ప్రభుత్వం తులం బంగారం, మహిళలకు రూ.2500 ఇచ్చినట్లయితే చెయ్యి గుర్తుకే ఓటెయ్యండి.. లేనియెడల కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ముస్లింలకు తోఫా, క్రిస్టియన్లకు క్రిస్మస్ కానుక, ముఖ్యంగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం ఉట్టిపడే బతుకమ్మ చీరలు పంపిణీలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయిందని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టిన పథకాలను కేసీఆర్ కిట్టు లో భాగంగా మగ బిడ్డ జన్మిస్తే రూ.12,000, ఆడపిల్ల జన్మిస్తే రూ.13 వేలు అందేవి, గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందించడంలో కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం కేసీఆర్ పథకాలను నిరుపేదలకు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. ఆరు నెలలైనా రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాలో ఇంకా జమ కాలేదని, సన్న రకం వడ్లు పండిస్తే మద్దతు ధరతో పాటు, అదనంగా రూ. 500 బోనస్ కల్పిస్తామని ఎన్నికల్లో హామీ కల్పించి, రెండేళ్లగా సన్న రకం వడ్లు పండించిన రైతులకు బోనస్ ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి సర్కార్ అని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజలకు నమ్మకం సన్నగిల్లిందని జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున 70 సర్పంచ్ స్థానాలు గెలిచి చూపించామని, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 36 స్థానాలకు అత్యధికంగా గెలుపొంది, మున్సిపల్ పై గులాబీ జెండా ఎగురవేస్తే, తాండూర్ లో ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఖేల్ ఖతం అవుతుందని పేర్కొన్నారు.

జీవో విడుదల చేసే దమ్ముందా..

గత బిఆర్ఎస్ పాలనలో తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి చొరవతో , మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో తాండూర్ కు మెడికల్ కళాశాల మంజూరు చేశారని, కాగా సీఎం రేవంత్ రెడ్డి తాండూర్ విద్యావంతులకు, ప్రజలకు నిలువెత్తు మోసం చేస్తూ తాండూర్ పేరు పై ఉన్న మెడికల్ కళాశాలను కొడంగల్ కు తరలించడం విడ్డూరం. అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలను మోసం చేయడమే కాకుండా, సొంత ఇలాకా ప్రజలనే దౌర్జన్యం చేస్తూ.. తాండూర్ పేరిట ఉన్న మెడికల్ కాలేజీ ను కొడంగల్ కు తరలించడం సబాబు కాదని, అందుకోసం తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అండగా నిలుస్తుందని సభాముఖంగా తెలియజేశారు. ఈనెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల లోపు దమ్ముంటే తాండూర్ లో ఉన్న మెడికల్ కాలేజ్ భవనం , తాండూర్ కే సంబంధించినదని జీవో విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.

పైలెట్ పక్కా లోకల్ బిడ్డగత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అరచేతిలో ఆరు గ్యారెంటీల అభయహస్తం కార్డుతో తాండూర్ ప్రజలను మోసం చేస్తూ.. గెలిచిన తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఎలా వచ్చారు అదే దారిలో వెళ్లిపోవడం ఖాయమని మండిపడ్డారు. మీ బిడ్డగా, మీ ఇంటి అన్నగా, పెద్ద మనిషిగా తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నిరంతరం ప్రజాసేవకే,తాండూర్ అభివృద్ధికి తోడ్పడుతాడని నేను తాండూర్ ప్రజలకు సభా ముఖంగా భరోసా కల్పిస్తున్నానని రానున్న రోజుల్లో తాండూర్ అడ్డా పైలెట్ రోహిత్ రెడ్డి అడ్డగా మారుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీశైల్ రెడ్డి, వికారాబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థల చైర్మన్ రాజు గౌడ్, తాండూర్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, శ్రీనివాస్ చారి, వర్కింగ్ ప్రెసిడెంట్ నరుకుల నరేందర్ గౌడ్, 36 వార్డుల బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.

FSL: ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదం వెనుక కేటీఆర్ హస్తం.. అనుమానం వ్యక్తం చేసిన కాంగ్రెస్

Next Story