- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
VIRAL: శత్రువుకు శత్రువు.. మిత్రుడే..! జగన్ నివాసం వద్ద ఆసక్తికర కటౌట్
పురాణాల్లో చెప్పిన విధంగా శత్రువుకు శత్రువు.. మిత్రుడే అన్నట్లుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan), కేసీఆర్ (KCR)ల మైత్రి కొనసాగుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: పురాణాల్లో చెప్పిన విధంగా శత్రువుకు శత్రువు.. మిత్రుడే అన్నట్లుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan), కేసీఆర్ (KCR)ల మైత్రి కొనసాగుతోంది. రాష్ట్రం రెండుగా విడిపోయినా.. ఆ ఇద్దరి మధ్య రాజకీయ సంబంధాలు మాత్రం చెక్కుచెదరడం లేదు. తాజాగా, రేపు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వైసీపీ శ్రేణులు సంబురాలకు సిద్ధమవుతున్నారు. ప్రతి జిల్లాలో ఎక్కడ చూసినా శుభాకాంక్షలు తెలపుతూ.. ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ తాడేపల్లి (Thadepally)లోని జగన్ నివాసం వద్ద ఓ ఆసక్తికర కటౌట్ సందడి చేస్తోంది. ఆ కటౌట్‌పై భాగంలో జగన్ సమరశంఖం పూరిస్తుండగా.. కేటీఆర్ (KTR), కేసీఆర్ (KCR) చిరునవ్వు చిందిస్తూ కనిపిస్తున్నారు. అయితే, అది చూసిన జనం ఇదెక్కడి కాంబినేషన్ రా మామా.. అంటూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా కటౌట్ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
కాగా, 2019లో జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ (Telangana) సీఎంగా ఉన్న కేసీఆర్‌తో బాంధవ్యం పెంచుకున్నారు. ఇద్దరూ చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)ని ఉమ్మడి శత్రువుగా చూస్తూ ఇరు రాష్ట్రాల నీటి పంపకాలు, గోదావరి-కృష్ణా నదుల అనుసంధానం వంటి అంశాల్లో ఒకరికొకరు సహకరించుకున్నారు. మరోవైపు జగన్ గెలుపులో కేసీఆర్ సహాయపడినట్లుగా గతంలో వార్తలు కూడా వచ్చాయి. ఇక సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్‌ను ఆహ్వానించిన విషయం తెలిసిందే. 2024లో కేసీఆర్‌కు హిప్ సర్జరీ అయితే జగన్ ప్రత్యేకంగా హైదరాబాద్‌కు వచ్చి ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఇలా ఇప్పటి వరకైతే వారి మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉంది. తాజా ఘటనతో ఆ బంధం మరింత బలపడుతుందని ఇరు పార్టీల శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
READ MORE ....






