- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
న్యాయాధికారి బదిలీ.. మళ్లీ మొదటికి జగన్ ఆస్తుల కేసు
నాంపల్లి సీబీఐ కోర్టు న్యాయాధికారి బదిలీ కావడంతో జగన్ ఆస్తుల కేసు మళ్లీ మొదటికి వచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి...

దిశ, వెబ్ డెస్క్: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆస్తుల కేసు(Ys Jagan Assests Case)లో బిగ్ ట్విస్ట్ నెలకొంది. నాంపల్లి సీబీఐ కోర్టు న్యాయాధికారి రఘురాం(Nampally CBI Court Magistrate Raghuram) బదిలీ అయ్యారు. కొత్త న్యాయాధికారిగా పట్టాభిరామారావు నియామకమయ్యారు. ఈనెల 22 తర్వాత రిలీవ్ కావాలని, 29లోపు కొత్త పోస్టులో చేరాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే గతంలోనూ న్యాయాధికారి మారారు. ఆ సమయంలో జగన్ కేసు విచారణ మొదటికి వచ్చింది. ఇలా ప్రతిసారి జరుగుతుండటంతో కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతోంది. మరోవైపు డిశ్చార్జ్ పిటిషన్ల విచారణ కూడా ఇంకా పూర్తి కాలేదు. దీంతో ప్రధాన కేసులు ట్రయల్‌కు వెళ్లడం లేదు. పైగా జగన్ డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారు. అటు జగన్ కేసులు త్వరితగతిన విచారణ జరిపి తీర్పులు వెల్లడించాలని సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలున్నాయి. అయినా సరే విచారణ ముందుకు సాగడం లేదు. న్యాయధాకారి బదిలీ అయిన ప్రతిసారి కేసు విచారణను జగన్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సారైనా విచారణ పూర్తి అయి.. కేసుపై తీర్పు వస్తుందేమో చూడాలి.
READ MORE ....
శత్రువుకు శత్రువు.. మిత్రుడే..! జగన్ నివాసం వద్ద ఆసక్తికర కటౌట్






