విజయన్ మరో మోదీలా వ్యవహరిస్తుండు: సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-07 10:34:27  IST  )

కేరళ సీఎం పినరయి విజయన్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

విజయన్ మరో మోదీలా వ్యవహరిస్తుండు: సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కేరళ సీఎం పినరయి విజయన్‌ (Pinarayi Vijayan) కు రాసిన లేఖపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పినరయి విజయన్ ఎప్పుడు సిద్ధమన్నా తాను చర్చకు సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. ఇవాళ ఆయన తిరువనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పినరయి విజయన్‌కి రోల్ మోడల్స్ జ్యోతిబసు, సోమనాథ్ ఛటర్జీలా? లేక నరేంద్ర మోదీ, అమిత్ షానా? అని ప్రశ్నించారు. కానీ, ఆయన నరేంద్ర మోదీని తన రోల్ మోడల్‌గా భావిస్తున్నారని, ఆయన పద్ధతులు కేరళ ప్రజలకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని విమర్శించారు. విజయన్ ఓ ముఖ్యమంత్రిలా కాకుండా, మరో నరేంద్ర మోదీ’ తరహాలో ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పినరయి విజయన్‌పై ఉన్న అవినీతి కేసుల నుంచి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆయనను రక్షిస్తోందని విమర్శించారు. అందుకే ఎన్ని ఆరోపణలు వచ్చినా ఆయనపై కేంద్ర సంస్థలు చర్యలు తీసుకోవడం లేదని రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. దేశ రాజకీయాల్లో ఇండియా (INDIA) కూటమి భాగస్వాముల మధ్య ఇటువంటి వాగ్వాదం చోటుచేసుకోవడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. కేరళలో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల మధ్య ఉన్న రాజకీయ వైరం ఈ వ్యాఖ్యలతో మరోసారి బహిర్గతమైంది.

రాజకీయ విమర్శలు చేసేటప్పుడు భాషా సంస్కారం ఉండాలి: రేవంత్ రెడ్డికి కేరళ CM ఘాటు లేఖ

అరికెపూడి గాంధీ వర్సెస్ రవి యాదవ్.. రచ్చకెక్కిన లింక్ రోడ్ల రాజకీయం

Next Story