అరికెపూడి గాంధీ వర్సెస్ రవి యాదవ్.. రచ్చకెక్కిన లింక్ రోడ్ల రాజకీయం

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-04-07 08:16:09  IST  )

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ప్రధాన రాజకీయ పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. సోషల్ మీడియాలో పరస్పర విమర్శలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

అరికెపూడి గాంధీ వర్సెస్ రవి యాదవ్.. రచ్చకెక్కిన లింక్ రోడ్ల రాజకీయం
X

దిశ, శేరిలింగంపల్లి : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వెలువడుతుందో తెలియకపోయినా శే రిలింగంపల్లి నియోజకవర్గంలో ప్రధాన రాజకీయ పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. పాలకుల వైఫల్యాలు, ప్రధాన మౌలిక వసతులు లోపంపై సోషల్ మీడియా వేదికగా పరస్పరం విమర్శలు దుమారం రేపుతున్నాయి. పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీపై ట్రోల్ చేశారంటూ ఆయన అనుచరులు మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం హీటెక్కింది. లింక్ రోడ్ల నిర్మాణం ఆవశ్యకతపై గాంధీ అసెంబ్లీ ప్రసంగించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అసంపూర్తిగా మిగిలిపోయిన లింక్ రోడ్ల నిర్మాణం పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కోరారు. వివిధ సమస్యలపై ప్రస్తావించారు. ఇప్పటివరకు గుర్తించిన లింక్ రోడ్ నిర్మాణం పనులు పూర్తిచేస్తే గమ్యస్థానాలకు వెళ్లేందుకు సమయం ఆదా అవడంతో పాటు ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు వీలు కలుగుతుందన్నారు. రాష్ట్రంలోనే అత్యధిక జనసాంద్రత ఉన్న ప్రాంతం శేరిలింగంపల్లి. వాహనాల రాకపోకలతో విపరీతమైన ట్రాఫిక్ జామ్ జరుగుతుంది. సాఫ్ట్వేర్ కంపెనీలు అత్యధికంగా ఉన్న ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఈ విషయంపై గ్రేట్ హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ యూత్ వైస్ ప్రెసిడెంట్ రవి యాదవ్ స్పందించారు. ఆస్తులను కాపాడుకోవడం కోసమే ఎమ్మెల్యే గాంధీ పార్టీ మారారని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం హయాంలోనే లింక్ రోడ్ల నిర్మాణానికి బీజం పడింది. కోవిడ్ కష్టకాలంలోనూ అభివృద్ధి పనులు నిర్విరామంగా కొనసాగాయని, మూడేళ్ల పాలనలో అభివృద్ధి పనులు పూర్తి చేయడంలో గాంధీ ఘోర వైఫల్యం చెందారని ఆరోపించారు. కబ్జా చేసిన భూముల రక్షణ కోసమే గాంధీ పార్టీ ఫిరాయించారని చెప్పారు. ఆ విషయాన్ని ఒప్పుకునే ధైర్యం గాంధీకి లేకపోవడం సిగ్గుచేటు అన్నారు. శేరిలింగంపల్లిలో జరిగిన ప్రతి అభివృద్ధి వెనుక గత ప్రభుత్వ హయాంలో చేసినట్లు స్వయంగా గాంధీ ఒప్పుకున్నట్లయింది. బీఆర్ఎ స్ టికెట్‌పై గెలిచి, అభివృద్ధి పేరుతో కాంగ్రెస్‌లో చేరిన గాంధీ.. నిజంగా నియోజకవర్గ ప్రయోజనాల కోసమే వెళ్లారా? లేక తన ప్రయోజనాల కోసం వెళ్లారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ట్రోల్స్‌పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై దారుణమైన ట్రోల్స్ చేశారంటూ ఎమ్మెల్యే గాంధీ అనుచరులు మియాపూర్ పోలీస్ స్టేషన్ లో రవి కుమార్ యాదవ్‌పై ఫిర్యాదు చేశారు. ఇన్ స్పెక్టర్ శివ ప్రసాద్ విచారణ కోసం రవి కుమార్ యాదవ్‌ను పిలవడంతో భారీగా మద్దతు దారులతో స్టేషన్‌కు చేరుకున్నారు. స్థానిక ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మరోమారు ఆరోపణలు గుప్పించారు. మురుగు కాలువల్లో సీఎం రేవంత్ రెడ్డి, అరికేపూడి గాంధీ ఫొటోలు పెట్టి.. పనులు ఎప్పుడు పూర్తి చేస్తారని నిలదీస్తూ కొంత మంది ట్రోల్ చేశారు. డ్రైనేజీ పనుల కోసం.. శేరిలింగంపల్లిలో రోడ్లు తవ్వి నెలలు గడుస్తున్నా, ఇంకా పూర్తి కాలేదని, ఈ నేపథ్యంలోనే.. నువ్వు పార్టీలు మారావ్, మరి మా బస్తీల పరిస్థితి మారేదెప్పుడంటూ సోషల్ మీడియాలో వినూత్న నిరసన చేపట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా మున్సిపల్ పనులు ముందుకు సాగడం లేదని.. మురుగు కాలువల్లో ఫొటోలు పెట్టి సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడం రచ్చకు దారితీసింది.

విజయన్ మరో మోదీలా వ్యవహరిస్తుండు: సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Next Story