వైకుంఠ ఏకాదశి.. యాదగిరిగుట్ట, భద్రాద్రికి పోటెత్తిన భక్తులు

by Malleboina Mahesh |   (  Updated:2025-12-30 10:10:30  IST  )

మంగళవారం వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణలోని ప్రధాన ఆలయాలు విద్యుత్ కాంతులతో వెలుగులీనుతున్నాయి.

వైకుంఠ ఏకాదశి.. యాదగిరిగుట్ట, భద్రాద్రికి పోటెత్తిన భక్తులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. మంగళవారం వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణలోని ప్రధాన ఆలయాలు విద్యుత్ కాంతులతో వెలుగులీనుతున్నాయి. నేడు శ్రీమహావిష్ణువు ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి విచ్చేసి భక్తులకు దర్శనమిస్తారని ప్రతీతి. స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా రాష్ట్రంలోని భద్రాద్రి, యాదగిరిగుట్ట వంటి ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలు రంగురంగుల విద్యుత్ దీపాలు, సుగంధభరిత పుష్పాలతో అత్యంత సుందరంగా ముస్తాబయ్యాయి.

భక్తులకు స్వాగతం పలుకుతూ ఆలయ రాజగోపురాలను, ప్రాకారాలను అలంకరించారు. తోపులాటలు జరగకుండా పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. నిరంతర పర్యవేక్షణ కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వైకుంఠ ఏకాదశి వేడుకలకు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం, పాతగుట్ట ఆలయం ముస్తాబైంది. నేడు ఉదయం 5.30 గంటలకు స్వామివారి ఉత్తర ద్వార దర్శనాన్ని వైభవంగా ప్రారంభించారు. అలాగే హైదరాబాద్ నగరంలోని ప్రధాన వైష్ణవాలయాలు విద్యుత్ దీపాల వెలుగులో కాంతులీనుతున్నాయి.

తిరుమలలో పది రోజుల పండుగ

తిరుమల శ్రీవారి ఆలయంలో నేటి నుంచి పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కొనసాగనుంది. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ టీటీడీ ఇప్పటికే టైమ్ స్లాట్ టోకెన్లను జారీ చేసింది. అటు భద్రాద్రిలో రామయ్య ఉత్తర ద్వారం గుండా దర్శనమిచ్చే పవిత్ర ఘట్టాన్ని తిలకించేందుకు గోదావరి తీరం భక్తజన సంద్రమైంది. నేడు ఉపవాసం, జాగరణ, హరినామస్మరణతో తెలుగు రాష్ట్రాలన్నీ ఆధ్యాత్మిక పరిమళాన్ని వెదజల్లుతున్నాయి.

READ MORE ....

శ్రీవారి సేవలో తెలుగు రాష్ట్రాల మంత్రులు, ప్రముఖులు

Next Story