శ్రీవారి సేవలో తెలుగు రాష్ట్రాల మంత్రులు, ప్రముఖులు

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-12-30 10:11:41  IST  )

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు భక్తుల తాకిడి పెరిగింది. మంత్రులు, ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

శ్రీవారి సేవలో తెలుగు రాష్ట్రాల మంత్రులు, ప్రముఖులు
X

దిశ, వెబ్‌డెస్క్: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు భక్తుల తాకిడి పెరిగింది. అర్థరాత్రి వైకుంఠ ద్వారాలు తెరచుకోగా ముందుగా వీఐపీలకు ఉత్తర ద్వార దర్శనాన్ని కల్పించారు. తెలుగు రాష్ట్రాల మంత్రులు, ప్రముఖులు శ్రీవారి సేవలో పాల్గొన్నారు. తెలంగాణ సీఎం సహా.. స్పీకర్ గడ్డం ప్రసాద్, ఏపీ హైకోర్టు జడ్జి శ్రీనివాసులు, కేంద్రమంత్రి రామ్మోహన్, శాసన సభాపతులు అయ్యన్నపాత్రుడు, రఘురామకృష్ణరాజు, ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, సత్యకుమార్, కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్ శ్రీవారిని దర్శించుకున్నారు.

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, కుటుంబ సభ్యులు, నారా రోహిత్ దంపతులు, ఎంపీ వేమిరెడ్డి దంపతులు, క్రికెటర్ తిలక్ వర్మ, వైసీపీ నేతలు పెద్దిరెడ్డి, ఆర్కే రోజా, మిథున్ రెడ్డి, భారత్ బయోటెక్ ఎంపీ కృష్ణ ఎల్లా, మేనేజింగ్ డైరెక్టర్ సుచరిత ఎల్లా తదితరులు శ్రీవారిని ఉత్తరద్వారం గుండా దర్శించుకున్నారు.

READ MORE ....

వైకుంఠ ఏకాదశి.. యాదగిరిగుట్ట, భద్రాద్రికి పోటెత్తిన భక్తులు

Next Story