- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బై మిస్టేక్‌లో రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు: కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాదవశాత్తూ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే రేవంత్ రెడ్డి బీజేపీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మరోసారి అబద్ధాలతో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాడిద అసలు గుడ్డు పెట్టదు కానీ సీఎం రేవంత్ రెడ్డి పెట్టించారని అన్నారు.
రేవంత్ రెడ్డి పార్టీ గుర్తు గాడిద గుడ్డు అని ఎద్దేవా చేశారు. ఇక, మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేసి రిజర్వేషన్లు లేకుండా చేయాలని కుట్ర చేస్తోందంటున్న కాంగ్రెస్ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లను ఎవరూ తొలగించలేరని తేల్చిచెప్పారు. రాజ్యాంగాన్ని రద్దు చేయడం, రిజర్వేషన్లను తొలగించాలనే ఆలోచన అసలు బీజేపీకి లేదని క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలు చేస్తోందని ధ్వజమెత్తారు.
Read More...
నాకు పార్టీ ముఖ్యం పార్టీ లైన్ ముఖ్యం.. అదే నన్ను కాపాడుతుంది: సీఎం రేవంత్ రెడ్డి






