- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rescue operation: సిక్కిం టన్నెల్ ప్రమాదం.. ఇప్పటి వరకు 22 మృతదేహాలు వెలికితీత
ఎన్‌హెచ్‌పీసీ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ టన్నెల్ కూలిపోయిన ఘటన దేశంలో విషాదాన్ని నింపింది.

దిశ, వెబ్‌డెస్క్: సిక్కింలోని నామ్‌చి జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఎన్‌హెచ్‌పీసీ (NHPC) తీస్తా స్టేజ్-VI హైడ్రోపవర్ ప్రాజెక్ట్ టన్నెల్ కూలిపోయిన ఘటనలో ఇప్పటి వరకు 22 మంది కార్మికుల మృతదేహాలను వెలికితీసినట్లుగా అధికారులు వెల్లడించారు. సోమవారం మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో టన్నెల్ లోపల మీథేన్ గ్యాస్ పేలుడు సంభవించడంతో నిర్మాణంలో ఉన్న టన్నెల్ కూలిపోయిన సమయంలో మొత్తం 25 మంది కార్మికులు లోపల చిక్కుకుపోయారు. అయితే, టన్నెల్ లోపల చిక్కుకున్న మరో ముగ్గురు కార్మికులను గుర్తించి వెలికితీసేందుకు స్పెషల్ ఫోర్సెస్ సహాయక చర్యలను వేగవంతం చేశాయి. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల ప్రకటించారు. అదేవిధంగా సిక్కిం ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల పరిహారం ప్రకటించారు. ఈ ప్రమాదంలో మరణించిన ప్రతి ఒక్కరి కుటుంబానికి రూ.5 లక్షల నష్టపరిహారం అందిస్తామని ఎన్‌హెచ్‌పీసీ కూడా ప్రకటించింది.






