‘నా చావుకు ప్రధాని మోడీనే కారణం’.. సంచలనంగా మారిన సిరిసిల్ల యువకుడి సూసైడ్ నోట్!

by Jakkula.Mamatha |

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన విషాదం నింపింది.

‘నా చావుకు ప్రధాని మోడీనే కారణం’.. సంచలనంగా మారిన సిరిసిల్ల యువకుడి సూసైడ్ నోట్!
X

దిశ, ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన విషాదం నింపింది. గ్రామానికి చెందిన పిట్లవంశీ బుధవారం రాత్రి తన ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందాడు. ఆత్మహత్యకు ముందు రాసిన లేఖలో తన చావుకు పీఎం నరేంద్ర మోడీ కారణమని పేర్కొన్నట్లు స్థానికులు తెలిపారు. అలాగే తన కుటుంబ సభ్యులను ఎవరిని ఇబ్బందులకు గురి చేయవద్దని, తన అంతక్రియలను ఆనవాయితీ ప్రకారం నిర్వహించాలని లేఖలో పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసుకొని వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Next Story