ఎల్‌నినో దెబ్బ.. పత్తి రైతుకు ‘కలుపు’ తిప్పలు.. ఆరుతడి సాగు చేసినా తప్పని ఆర్థిక భారం!

by Jakkula.Mamatha |

మండలంలో ఎల్‌నినో ప్రభావం వల్ల రైతులు ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలని జిల్లా అధికార యంత్రాంగం మండలాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తోన్న విషయం తెలిసిందే.

ఎల్‌నినో దెబ్బ.. పత్తి రైతుకు ‘కలుపు’ తిప్పలు.. ఆరుతడి సాగు చేసినా తప్పని ఆర్థిక భారం!
X

దిశ, ఏన్కూర్: మండలంలో ఎల్‌నినో ప్రభావం వల్ల రైతులు ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలని జిల్లా అధికార యంత్రాంగం మండలాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మండలంలోని వివిధ గ్రామాల రైతులు, పత్తి, మొక్కజొన్న, పెసర, తదితర పంటల సాగుపై శ్రద్ధ కనబరుస్తున్న తరుణంలో.. పత్తి పంట సాగు చేస్తున్న రైతుకు కలుపు తొలగించడం పెద్ద భారంగా మారింది. ప్రస్తుతం కూలీల కొరత ఎక్కువగా ఉండటంతో, పత్తిలో కలుపు మొక్కలు తొలగించే కార్యక్రమంలో భాగంగా మందులు పిచికారి చేసే కార్యక్రమానికి రైతన్న శ్రీకారం చుట్టాడు. మందులు కొనుగోలు నుండి పత్తి పంటలో పిచికారి చేసే వరకు రైతన్నకు ఆర్థిక భారం పెరిగి పోవడంతో రైతులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారనే అభిప్రాయం రైతుల నుండి వినపడుతుంది. వర్షాభావం వల్ల సాగునీరు కొరతతో ఆరుతడి పంటల వైపు రైతులు మొగ్గు చూపుతున్న తరుణంలో పత్తి పంటలో కలుపు రైతులను పట్టిపీడిస్తోందని.. కలుపు మొక్కలు తొలగించేందుకు రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు.

Next Story