రోడ్డు పక్కన భారీ గుంత.. పొంచి ఉన్న ప్రమాదం

by Jakkula.Mamatha |

ప్రధాన రహదారిని ఆనుకొని తీసిన ఓ భారీ గుంత ప్రమాదాన్ని తలపిస్తుంది.

రోడ్డు పక్కన భారీ గుంత.. పొంచి ఉన్న ప్రమాదం
X

దిశ, నర్సాపూర్: ప్రధాన రహదారిని ఆనుకొని తీసిన ఓ భారీ గుంత ప్రమాదాన్ని తలపిస్తుంది. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో ప్రధాన రహదారికి అనుకొని ఓ భారీ గుంతను తీయడం జరిగింది. నల్ల కలెక్షన్ కోసమని 15 రోజుల క్రితం తీసిన ఈ గుంతను పూడ్చకపోవడంతో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోడ్డుపై వచ్చే వాహనదారులు ఏ మాత్రం రోడ్డు దిగిన గుంతలో పడి ప్రాణాలు వదిలే ప్రమాదం ఉంది. గుంత తీసి 15 రోజులు కావస్తున్నా అధికారులు కానీ పాలకవర్గం కానీ పట్టించుకున్న పాపాన పోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి గుంతను పూడ్చివేసి ప్రయాణికుల, చిన్నారుల ప్రాణాలను కాపాడాలని గ్రామస్తులు, వాహనదారులు కోరుతున్నారు.

Next Story