Lok Sabha: లోక్‌సభలో విపక్షాల ఆందోళన.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-23 07:03:46  IST  )

అధికార, విపక్ష సభ్యుల నినాదాలతో మరోసారి లోక్‌సభ హోరెత్తింది.

Lok Sabha: లోక్‌సభలో విపక్షాల ఆందోళన.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: నాలుగో రోజు పార్లమెంట్ సమావేశాలు తిరిగి (Parliament Sessions) ప్రారంభయ్యాయి. ఈ క్రమంలోనే సభలో అడుగుపెట్టడంతోనే విపక్ష సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం ప్రారంభించారు. అనంతరం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు పట్టుబట్టారు. ఈ క్రమంలోనే స్పీకర్ ఓం బిర్లా (Speaker Om Birla) కలుగజేసుకుని ‘నీట్’పై చర్చిద్దామని చెప్పినా.. విపక్ష సభ్యులు పట్టించుకోకుండా ఆవేశంతో పోడియం వైవునకు దూసుకెళ్లారు. ఓ దశలో అధికార, విపక్షాల మధ్య పోటాపోటీ నినాదాలు సభలో హోరెత్తాయి. దీంతో స్పీకర్ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా లోక్‌సభను వాయిదా వేశారు. అయితే, అంతకు ముందు పార్లమెంట్ ఎంట్రెన్స్‌లోని ‘మకర్ ద్వార్’ వద్ద ఎన్డీఏ, ఇండియా కూటమి సభ్యులు తగ్గేదేలేదన్నట్లుగా ఆందోళనలు నిర్వహించారు. తమ తమ డిమాండ్లను వినిపిస్తూ ప్లకార్డును సైతం ప్రదర్శించారు.

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా..! సోషల్ మీడియాలో లేఖ వైరల్

Next Story