మహేష్ ఫ్యాన్స్‌కు బిగ్ డిసప్పాయింట్‌మెంట్.. మహేష్ లేకుండానే ఆ వేడుక?

by Pulgam srinivas |

'శ్రీనివాస మంగాపురం' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మహేష్ బాబు రావడం లేదని ప్రచారం జరుగుతుంది.

మహేష్ ఫ్యాన్స్‌కు బిగ్ డిసప్పాయింట్‌మెంట్.. మహేష్ లేకుండానే ఆ వేడుక?
X

దిశ, వెబ్ డెస్క్: సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'శ్రీనివాస మంగాపురం'. ఈ సినిమా జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ముందు చిత్రబృందం భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు ప్రచారం జరిగింది. ఈ కార్యక్రమానికి మహేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరవుతారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం మహేష్ బాబు 'వారణాసి' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటంతో ఆయన చాలా కాలంగా ఎలాంటి పబ్లిక్ ఈవెంట్లలోనూ కనిపించడం లేదు.

దీంతో 'శ్రీనివాస మంగాపురం' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన పాల్గొంటారనే వార్తలు అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని నింపాయి. అయితే తాజా సమాచారం ప్రకారం మహేష్ బాబు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. 'వారణాసి' చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణలో ఆయన పాల్గొంటున్నందున, ఆసక్తి ఉన్నప్పటికీ ఈ కార్యక్రమానికి రావడం సాధ్యం కాదని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మహేష్ బాబు ఈ ఈవెంట్‌కు దూరంగా ఉండనున్నారనే వార్తలు రావడంతో ఆయన అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. అయితే చిత్రబృందం నుంచి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Next Story