- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైట్ కట్ డ్రెస్ లో రెచ్చిపోయిన డైసీ షా.. ఆ అందాలకు ఎవరైనా ఫిదా కావాల్సిందే
గాగుల్స్‌తో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన డైసీ షా.

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ బాలీవుడ్ నటి డైసీ షా 1984 ఆగస్టు 25న జన్మించారు. మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన ఆమె, కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య వద్ద సహాయకురాలిగా పనిచేసి సినీ రంగంలో అడుగుపెట్టారు.
2007లో విడుదలైన తమిళ చిత్రం 'పోరి'తో వెండితెరకు పరిచయమైన ఈ భామ.. అనంతరం 2011లో వచ్చిన కన్నడ చిత్రం 'భద్ర'లో ప్రధాన పాత్ర పోషించారు.
ఇక 2014లో విడుదలైన 'జై హో' చిత్రంలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హిందీతో పాటు పలు భాషల్లో నటించిన డైసీ షా ఇటీవల సినిమాల్లో కనిపించడం తగ్గించినా, సోషల్ మీడియాలో మాత్రం అభిమానులతో నిరంతరం టచ్‌లో ఉంటున్నారు.
తాజాగా డైసీ షా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని స్టైలిష్ ఫొటోలను పంచుకున్నారు. వైట్ కట్ డ్రెస్‌లో ట్రెండీ లుక్‌తో కెమెరాకు ఇచ్చిన ఫోజులు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా గాగుల్స్‌తో స్టైలిష్‌గా కనిపించిన ఆమె లుక్ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
సైడ్ యాంగిల్‌లో తీసిన ఫొటోలు ఆమె స్టైలిష్ లుక్ ని మరింత హైలైట్ చేయగా, ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Photos Courtesy: Instagram






