కరకగూడెం సెంటర్‌లో విస్తృత వాహన తనిఖీలు

by Jakkula.Mamatha |

జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు.. మణుగూరు డీఎస్పీ వి.రవీందర్ రెడ్డి పర్యవేక్షణలో కరకగూడెం సెంటర్‌లో పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు.

కరకగూడెం సెంటర్‌లో విస్తృత వాహన తనిఖీలు
X

దిశ,కరకగూడెం: జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు.. మణుగూరు డీఎస్పీ వి.రవీందర్ రెడ్డి పర్యవేక్షణలో కరకగూడెం సెంటర్‌లో పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన నెంబర్ ప్లేట్ లేని వాహనాలు, నంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న వాహనాలు, డ్రైవింగ్ లైసెన్స్ లేని వాహనదారులను గుర్తించి తనిఖీలు చేపట్టారు. అలాగే కూలీలను తరలిస్తున్న వాహనాలు సైతం ఆపి తనిఖీలు నిర్వహించి.. వాహనదారులకు రహదారి భద్రతా నిబంధనలపై అవగాహన కల్పిస్తూ కౌన్సెలింగ్ ఇచ్చారు. వాహనదారులు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, వాహనాలకు నిబంధనల ప్రకారం నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు. ఈ కార్యక్రమంలో కరకగూడెం ఎస్‌ఐ పి.వి.ఎన్. రావు, హెడ్ కానిస్టేబుల్ కనకేష్ కుమార్, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story