- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎంతమంది డాక్టర్లు ఉన్నారు.. ఇంకెంత మంది కావాలి?.. గాంధీ ఆసుపత్రిలో కిషన్ రెడ్డి ఆకస్మిక తనిఖీ
హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి(Gandhi Hospital)ని సోమవారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) పరిశీలించారు.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి(Gandhi Hospital)ని సోమవారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) పరిశీలించారు. ఆసుపత్రి ఆవరణను, భవనంలోని ప్రతీ విభాగానికి సంబంధించిన వివరాలను ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో పాటు ఇతర వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కోవిడ్(Covid) టైమ్‌లో ప్రారంభించిన ఆక్సిజన్ ప్లాంట్‌ను సందర్శించారు. ఆసుపత్రి భవనాలను వాటి మెయింటెనెన్స్‌ను స్వయంగా పరిశీలించారు. అయితే ఆసుపత్రిలో డ్రైన్ వ్యవస్థ మెరుగుపరిచలని సూచించారు. అనంతరం మెయింటెనెన్స్‌తో పాటు ఆస్పత్రిలో ఉన్న ప్రస్తుత ఖాళీలు ఎన్ని..? వైద్య సిబ్బంది మొత్తం ఎంతమంది ఉన్నారు? డాక్టర్ల కొరత ఏమైనా ఉందా? ఎంత మంది డాక్టర్లు పనిచేస్తున్నారు? అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఏయే సర్జరీలు జరుగుతున్నాయి.
ఎలాంటి సర్జరీలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని తెలుసుకున్నారు. ఆసుపత్రిలో డయాగ్నస్టిక్స్ పరిస్థితి ఏంటి? రోగులకు ఎలాంటి వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఏయే వైద్య పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. సంబంధిత వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలు ఎలా అందుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. ఆయుష్మాన్ భారత్ కింద వైద్య పరీక్షలు ఎలా కొనసాగుతున్నాయి. ఆయుష్మాన్ భారత్ కింద ఎన్ని పోస్టులు ఉన్నాయి.. ఎంతమంది సిబ్బంది నియమించుకున్నారు. అవి ఎలాంటి పోస్టులు అని అడిగారు. ఎక్కువగా ఎలాంటి కేసులు నమోదు అవుతుంటాయి. ప్రస్తుతం ఇక్కడ ఎలాంటి కేసులు నమోదు అయ్యాయి. ఇక్కడే అందరికి వైద్య పరీక్షలు చేస్తున్నారా? వంటి ప్రశ్నలను సిబ్బందికి అడిగి తెలుసుకున్నారు.
Also Read..






