- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం
మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. హాంకాంగ్(Hong Kong) నుంచి ఢిల్లీకి వస్తున్న బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్(Dreamliner)లో పైలట్లు సాంకేతిక లోపాన్ని గుర్తించారు.

దిశ, వెబ్‌డెస్క్: మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. హాంకాంగ్(Hong Kong) నుంచి ఢిల్లీకి వస్తున్న బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్(Dreamliner)లో పైలట్లు సాంకేతిక లోపాన్ని గుర్తించారు. దీంతో చేసేదేం లేక వెంటనే విమానాన్ని వెనక్కి పైలట్లు మళ్లించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సకాలంలో సమస్యను గుర్తించి.. వెనక్కి మళ్లించిన పైలట్లను ఎయిర్‌పోర్టు(Airport) సిబ్బంది అభినందించారు. ఇదిలా ఉంటే.. ఇటీవలి కాలంలో వరుస విమాన ప్రమాదాలు జరుగుతుండటంతో.. విమానాల్లో ప్రయాణించాలంటేనే చాలా మంది భయభ్రాంతులకు గురవుతున్నారు. అయితే గాల్లో ఎగిరే అన్ని విమానాలకు ప్రమాదం లేనప్పటికీ.. గత కొంత కాలంగా జరుగుతున్న ఘటనలు ప్రయాణికుల్లో ఏదో తెలియని భయాన్ని నింపాయి. ఇప్పటికే అహ్మదాబాద్ విమాన ప్రమాదం కారణం వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా, మళ్లీ అదే ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం రావడం అందరినీ టెన్షన్ పెట్టింది. సకాలంలో సిబ్బంది స్పందించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.






