- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MLC కవితతో కేంద్రమంత్రి అథవాలే భేటీ
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో కేంద్ర సామాజిక, న్యాయశాఖ సహాయ మంత్రి రాందాస్ అథవాలే భేటీ అయ్యారు.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో కేంద్ర సామాజిక, న్యాయశాఖ సహాయ మంత్రి రాందాస్ అథవాలే భేటీ అయ్యారు. హైదరాబాద్‌కు విచ్చేసిన ఆయన కవిత ఆహ్వానం మేరకు శుక్రవారం ఆమె నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి చేస్తున్న బీసీ ఉద్యమం, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై చర్చించారు. అదే సమయంలో బీసీ బిల్లులను రాష్ట్రపతి ఆమోదించడానికి చొరవ తీసుకోవాలని కవిత వినతిపత్రం అందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి గానూ తెలంగాణ అసెంబ్లీ పాస్ చేసి రాష్ట్రపతి ఆమోదానికి పంపించిన బిల్లులను త్వరగా ఆమోదించేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమాజ నిర్మాణంలో, నాగరికత వికాసంలో బహుజనుల పాత్ర అత్యంత కీలకమైనదని, అదే సమయంలో స్థానిక సంస్థల్లో ఆ వర్గాల ప్రాతినిధ్యం వారి జనాభా ప్రాతిపదికన లేకపోవడం ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు.
సమాన అవకాశాల కోసం ఓబీసీలు దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలంగాణలో సుదీర్ఘకాలంగా ఉద్యమిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ న్యాయమైనదని తెలంగాణ జాగృతి బలంగా విశ్వసిస్తున్నదని, ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజాస్వామికంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఉద్యమాలు, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించడం జరిగిందని వివరించారు. దాంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ, శాసన మండలిలో రెండు వేర్వురు బిల్లులు ప్రవేశ పెట్టి ఆమోదించింది రాష్ట్రపతి ఆమోదానికి పంపించిందని గుర్తు చేశారు. అయితే.. రాష్ట్రపతి ఆమోదానికి బిల్లులు పంపించి చాలా కాలం గడుస్తున్నా ఇంకా ఆమోదముద్ర పడని విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, రూప్‌సింగ్, మరిపల్లి మాధవి, మహేందర్ ముదిరాజ్, మనోజ్‌గౌడ్, యూనైటెడ్ ఫూలే ఫ్రంట్ కన్వీనర్ బొల్ల శివ శంకర్, కో ఆర్డినేటర్ ఆలకుంట హరి తదితరులు పాల్గొన్నారు.
Read More..
MLC Kavitha: కవిత న్యూ ట్రెండ్ పాలిటిక్స్.. నిన్న కేంద్ర మంత్రి నేడు కేరళ ఎంపీ భేటీ






