MLC Kavitha: కవిత న్యూ ట్రెండ్ పాలిటిక్స్.. నిన్న కేంద్ర మంత్రి నేడు కేరళ ఎంపీ భేటీ

by Prasad Jukanti |   (  Updated:2025-06-28 07:04:33  IST  )

కవితతో కేరళ సీపీఐ ఎంపీ సందోశ్ కుమార్ భేటీ అయ్యారు.

MLC Kavitha: కవిత న్యూ ట్రెండ్ పాలిటిక్స్.. నిన్న కేంద్ర మంత్రి నేడు కేరళ ఎంపీ భేటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో (MLC Kavita) కేరళకు చెందిన సీపీఐ రాజ్యసభ్యుడు సందోష్ కుమార్ (CPI MP Sandosh Kumar) భేటీ అయ్యారు. శనివారం ఉదయం బంజారాహిల్స్ లోని తన నివాసానికి వచ్చిన సందోష్ తో ఎమ్మెల్సీ కవిత పలు అంశాలపై చర్చించారు. తెలంగాణ జాగృతితో సాంస్కృతిక అంశాల్లో కలిసి పని చేస్తామని ఈ సందర్భంగా సందోష్ హామీ ఇచ్చారు. సీపీఐకి చెందిన సాంస్కృతిక యువ కళావాహిని వివిధ దేశాల్లో తెలంగాణ జాగృతితో (Telangana Jagruti) కలిసి సాహిత్య, సాంస్కృతిక అంశాల్లో పని చేస్తుందని తెలిపారు.

నిన్న కేంద్ర మంత్రి.. ఇవాళ కేరళ ఎంపీ..

కాగా గత కొంత కాలంగా తెలంగాణ జాగృతి పేరుతో వివిధ కార్యక్రమాలు చేపడుతున్న కవిత వివిధ రాజకీయ పక్షాల మద్దతు కోరుతున్నారు. ఈ మేరకు ఆయా పార్టీల ముఖ్య నాయకులను కలుస్తున్నారు. నాలుగు రోజుల క్రితం తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీతో కవిత భేటీ అయిన సంగతి తెలిసిందే. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకై జులై 17న తలపెట్టిన రైల్ రోకో కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని ఆమె జాన్ వెస్లీని కోరారు. అంతకు ముందు బీజేపీ ఎంపీ రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్యను సైతం కవిత కలిసి మద్దతు కోరారు. నిన్న కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి రాందాస్ అథవాలే స్వయంగా కవిత ఇంటికి వెళ్లి ఆమెతో భేటీ కావడం రాజకీయంగా చర్చనీయాశం అయింది. బీసీ ఉద్యమం, 42 శాతం రిజర్వేషన్ల అంశంపై కేంద్ర మంత్రి, కవిత మధ్య చర్చ జరిగింది. అయితే నిన్న కేంద్ర మంత్రి స్వయంగా కవిత నివాసానికి వెళ్లి భేటీ కాగా ఇవాళ కేరళ సీపీఐ ఎంపీ సందోష్ కుమార్ కవిత నివాసానికి వెళ్లి కలవడం పొలిటికల్ గా ఆసక్తిని రేపుతోంది.

Read More..

MLC కవితతో కేంద్రమంత్రి అథవాలే భేటీ

Next Story