- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వికారాబాద్ జిల్లాలో అనూహ్య ఘటన.. రోడ్డుపై బైఠాయించి సర్పంచ్ అభ్యర్థి నిరసన
రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ వేళ వికారాబాద్ (Vikarabad) జిల్లాలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ వేళ వికారాబాద్ (Vikarabad) జిల్లాలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. మోమిన్‌పేట (Moment) మండల పరిధిలోని గోల్కొండ (Golkonda) గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి కీర్తి (Keerthi) రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఎన్నికల అధికారులు, పోలీసులు ఓ వర్గానికి సహకరిస్తున్నారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఈ ఘటన జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.
గోల్కొండ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన కీర్తి, ఎన్నికల ప్రక్రియలో అధికారులు పక్షపాతం వహిస్తున్నారని, పోలీసులు కూడా తన ప్రత్యర్థి వర్గానికి పూర్తిగా సహకరిస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాల్సిన ఎన్నికలు మలినం చేస్తున్నారని ధ్వజమెత్తారు. దీంతో ఆమె రోడ్డుపై బైఠాయించి తమ హక్కులను కాపాడాలని, న్యాయంగా పోలింగ్ ప్రక్రియను నిర్వహించాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అభ్యర్థి కీర్తిని నిరసన విరమించేలా చేశారు. అనంతరం పోలింగ్ ప్రక్రియ యథావిధిగా కొనసాగుతోంది.
READ MORE ...
గుండె నొప్పి అని చెప్పి సెలవు పెట్టి ఎన్నికల రోజు అంగన్ వాడీ టీచర్ ప్రచారం






