- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sarpanch Elections: గుండె నొప్పి అని చెప్పి సెలవు పెట్టి ఎన్నికల రోజు అంగన్ వాడీ టీచర్ ప్రచారం
గుండె నొప్పి కారణంతో సెలవు పెట్టిన ఓ అంగన్ వాడీ టీచర్ పోలింగ్ రోజు ప్రచారం నిర్వహించిన ఘటన కలకలం రేపుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో (Panchayat Elections Telangana) అధికారుల గైర్హాజరు (Election Duty Violation) చర్చనీయాశంగా మారింది. మొదటి విడతలో పలువురు అధికారులు ఎన్నికల విధులకు డుమ్మా కొట్టగా అలాంటి వారిపై ఉన్నతాధికారులు సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. విధులకు హాజరుకాని అధికారులను పలు జిల్లాల్లో సస్పెండ్ చేయగా మరి కొన్ని చోట్ల షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఈ వ్యవహారంపై ఇలా ఉండగా తాజాగా ఇవాళ జరుగుతున్న రెండో విడత పోలింగ్ సందర్భంగా ఎన్నికల విధులు నిర్వహించాల్సిన అంగన్ వాడీ టీచర్ తీరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తనకు గుండెనొప్పి ఉందనే సాకు చెప్పి సెలవు పెట్టిన సదరు అంగన్ వాడీ (Anganwadi Teacher) టీచర్.. ఎన్నికల రోజు ఓ అభ్యర్థి తరఫున ప్రచారం ప్రచారం చేయడం కలకలం రేపింది. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‍గా మారింది. సోషల్ మీడియా ప్రచారం ప్రకారం ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో వలిగొండ మండలం గోపరాజుపల్లిలో జరిగినట్లు తెలుస్తోంది.
READ MORE ...
వికారాబాద్ జిల్లాలో అనూహ్య ఘటన.. రోడ్డుపై బైఠాయించి సర్పంచ్ అభ్యర్థి నిరసన






