కాంగ్రెస్‌లో క్షోభ భరించలేకే బీఆర్ఎస్‌లోకి.. కారు ఎక్కిన జీవన్ రెడ్డి సభలో సంచలన వ్యాఖ్యలు

by Ramesh Naini |   (  Updated:2026-04-20 15:04:01  IST  )

సీనియర్ రాజకీయ నేత జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి, కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు.

కాంగ్రెస్‌లో క్షోభ భరించలేకే బీఆర్ఎస్‌లోకి.. కారు ఎక్కిన జీవన్ రెడ్డి సభలో సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: సీనియర్ రాజకీయ నేత జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి, కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. జగిత్యాలలో జరిగిన ‘ప్రజా ఆశీర్వాద సభ’లో కేసీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా తన రాజకీయ ప్రయాణం ఒక మలుపు తిరిగిందని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్‌ కోసం పనిచేసిన తనకు గత 20 నెలలుగా తీవ్ర మానసిక క్షోభ, వివక్ష మాత్రమే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. జీవిత చరమాంకంలో ఈ అవమానాలు భరించలేక, రాష్ట్రానికి పట్టిన శని వదలాలనే ఉద్దేశంతోనే తాను పార్టీ మారాను తప్ప.. పదవులను ఆశించి కాదని స్పష్టం చేశారు.

రేవంత్ సర్కార్‌పై విమర్శలు

మేడిగడ్డలో పిల్లర్లు కుంగితే రిపేర్ చేయకుండా రాద్ధాంతం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి.. నిర్మాణ దశలో ఉన్న ఎస్ఎల్‌బీసీ (SLBC) కూలి 8 మంది చనిపోతే కనీసం మృతదేహాలను కూడా బయటకు తీయలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధును ఎగ్గొట్టడంతో పాటు, తులం బంగారం ఇస్తామన్న నెపంతో ఉన్న కల్యాణలక్ష్మి పథకాన్ని కూడా అటకెక్కించిందని మండిపడ్డారు. విద్యార్థి దశ నుంచే కేసీఆర్‌తో తనకు అనుబంధం ఉందని, ఈ కష్టకాలంలో ఆయన తనకు అండగా నిలిచారని జీవన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. కేవలం కేసీఆర్ దూరదృష్టితోనే జగిత్యాల జిల్లాగా ఏర్పడిందని, మెడికల్ కాలేజీ, బోర్నపల్లి బ్రిడ్జి, గురుకుల పాఠశాలలు అందుబాటులోకి వచ్చాయని కొనియాడారు. గిరిజనులకు రిజర్వేషన్లు పెంచిన ఘనత కూడా కేసీఆర్‌దేనని ప్రశంసించారు.

‘నువ్వు వెయ్యి జన్మలు ఎత్తినా నేను చావను నా కొడకా’.. CM రేవంత్‌కు కేసీఆర్ హెచ్చరిక

Next Story