దానికి ఎన్టీఆరే కారణం.. మరోసారి Thummala Nageswara Rao సంచలన వ్యాఖ్యలు

by GSrikanth |   (  Updated:2022-11-28 15:37:47  IST  )

టీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కొత్తూరులో టీడీపీ శ్రేణులతో తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

దానికి ఎన్టీఆరే కారణం.. మరోసారి Thummala Nageswara Rao  సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కొత్తూరులో టీడీపీ శ్రేణులతో తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ఇచ్చిన అవకాశాల వల్లే ఇన్నాళ్లు రాజకీయాల్లో ఉన్నానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కుటుంబాన్ని, అనుచరులను పక్కకు పెట్టి మరీ జిల్లా అభివృద్ధికి తీవ్రంగా కృషి చేశానని అన్నారు. అనంతరం వచ్చే ఎన్నికల్లో పాలేరులో తుమ్మల నాగేశ్వరరావును గెలిపించుకుంటామంటూ టీడీపీ శ్రేణులు ఏకగ్రీవ తీర్మాణం చేశారు. ఎన్టీఆర్ నుంచి కేసీఆర్ వరకు అందరూ ముఖ్యమంత్రులు తనకు అవకాశం కల్పించారని, ప్రజలకు సేవచేసే అవకాశం కల్పించారని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో రూ.15 వేల కోట్లతో సీతారామ ప్రాజెక్టు పనులు చేపట్టామని గుర్తుచేశారు. గోదావరి నీళ్లు పాలేరు తీసుకురావాలన్నదే తన ఆకాంక్ష అని వ్యాఖ్యానించారు.

Read more:

టికెట్ల కేటాయింపుపై టీ-టీడీపీ కీలక నిర్ణయం

Next Story