- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సిరిసిల్లలో పోలీసుల స్పెషల్ డ్రైవ్.. 55 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు
జిల్లా వ్యాప్తంగా బుధవారం డ్రంక్ అండ్ డ్రైవ్, నంబర్ ప్లేట్ తొలగింపుపై జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఆదేశాల మేరకు పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన, నెంబర్ ప్లేట్ తొలగించిన వాహనాలపై ఫోకస్ పెట్టారు.

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: జిల్లా వ్యాప్తంగా బుధవారం డ్రంక్ అండ్ డ్రైవ్, నంబర్ ప్లేట్ తొలగింపుపై జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఆదేశాల మేరకు పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన, నెంబర్ ప్లేట్ తొలగించిన వాహనాలపై ఫోకస్ పెట్టారు. మొత్తం 55 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు కాగా, వాహనాలకు నంబర్ ప్లేట్ తొలగించిన, కనపడకుండా మార్ఫింగ్ చేసిన 24 వాహనాలు గుర్తించినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు.
జిల్లాలో మద్యం సేవించి వాహనాలు నడపడం, వాహనాలకు నంబర్ ప్లేట్ తొలగించి వాహనాలు నడపడం, నంబర్ ప్లేట్ మార్ఫింగ్ చేసి వాహనాలు నడపడం వంటి చర్యల పై కఠినంగా వ్యవహరించడం జరుగుతుందన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా, విస్తృతంగా ప్రతి రోజు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో వాహనాల తనిఖీ, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి వాహనదారుడు తన వాహనానికి నంబర్ ప్లేట్‌ను స్పష్టంగా కనిపించే విధంగా తప్పనిసరిగా ఏర్పాటు తెలిపారు. లేదంటే చీటింగ్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.






