- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆరు డీఏలు పెండింగ్ పెట్టడం దారుణం.. జలమండలి గేట్ సభలో హరీశ్ రావు ఫైర్
తెలంగాణలో ఆరు డీఏలు పెండింగ్‌లో పెట్టడం దారుణమన్న మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు (Hairsh Rao) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇవాళ ఖైరతాబాద్‌లోని జలమండలి గేట్ మీటింగ్‌లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.... కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులను, కార్మికులను ఘోరంగా మోసం చేస్తోందని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ఏకంగా ఆరు డీఏ (DA) లను పెండింగ్‌లో పెట్టడం దారుణమని ఆరోపించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న కొత్త పీఆర్సీ (PRC) ప్రకటన వస్తుందని ఉద్యోగులు ఆశగా ఎదురుచూసినా నిరాశే మిగిలిందని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జలమండలిలో ఎలాంటి లంచాలు లేకుండా ఉద్యోగుల క్రమబద్ధీకరణ, పదోన్నతులు (Promotions) కల్పించామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఎల్లప్పుడూ ప్రశ్నించే గొంతుక అవసరమని పిలుపునిచ్చారు.
’సిగాచి’ బాధితులకు అన్యాయం..
ఏడాది క్రితం పటాన్‌చెరు సిగాచి పరిశ్రమలో బాయిలర్ పేలి చనిపోయిన కార్మికుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇస్తామని చెప్పి ఏడాది గడిచినా, ఇప్పటివరకు ఎలాంటి అతీగతీ లేదని దుయ్యబట్టారు. జీహెచ్ఎంసీ (GHMC), ఆర్టీసీ (RTC), సింగరేణి కార్మికులను ఈ ప్రభుత్వం పూర్తిగా వంచించిందని.. రెండున్నరేళ్లు గడుస్తున్నా కనీసం పీఆర్సీ ప్రకటన కూడా లేకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.






