- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రాంతీయ విద్వేషాలు రేపుతున్నారు: పవన్ కల్యాణ్‌పై కె. రామకృష్ణ ఫైర్
CPI National Secretary K. Ramakrishna

దిశ, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(AP Deputy CM Pawan Kalyan)పై సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య పవన్ కల్యాణ్ ప్రాంతీయ విద్వేషాలు రేపుతూ కుట్రలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. జనసేన పార్టీకి సంబంధించిన జెండా, అజెండాలను పక్కనబెట్టేసి, కేవలం బీజేపీ జెండాను మోయడమే పవన్ ఏకైక పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్ తన విధులను సమర్థవంతంగా నిర్వహించడంలో పూర్తిగా విఫలమయ్యారని రామకృష్ణ ఆరోపించారు.
ద్వంద్వ నీతికి నిదర్శనం
ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించే హక్కులపై పవన్ కల్యాణ్ తీరును రామకృష్ణ తీవ్రంగా తప్పుబట్టారు. ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను అరెస్ట్ చేస్తామంటూ బెదిరింపులకు దిగడం ఏంటని ఆయన ప్రశ్నించారు. పవన్ కల్యాణ్‌కు కేవలం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే ప్రజాస్వామ్య విలువలు, హక్కులు గుర్తొస్తాయా అని నిలదీశారు. అధికారంలోకి రాగానే ప్రశ్నించే గొంతులను నొక్కేయాలని చూడటం పవన్ ద్వంద్వ నీతికి నిదర్శనమంటూ సీపీఐ నేత రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.






