- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రామ్ నితిన్ బర్త్ డే స్పెషల్.. కొత్త సినిమా పోస్టర్‌తో హైప్ పెంచిన మేకర్స్
నేడు రామ్ నితిన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన తదుపరి చిత్రానికి సంబంధించిన స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో రామ్ నితిన్ వెబ్ సిరీస్‌ల ద్వారా ఫుల్ ఫేమ్ రాబట్టుకుని నటనపై ఆసక్తితో.. ‘మ్యాడ్’ మూవీతో ఇండస్ట్రీకి వచ్చాడు. ‘మ్యాడ్’లో తన కామెడీ టైమింగ్‌తో అందరినీ కడుపుబ్బా నవ్వించాడు. ఇక ఈ మూవీ హిట్ కావడంతో అదే ఫామ్‌లో మ్యాడ్ స్వ్కేర్ చేశాడు. గత ఏడాది ‘జిగ్రీస్’లో నటించి మెప్పించాడు. ఇక ఇప్పుడు ఒక వినూత్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నేడు రామ్ నితిన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన తదుపరి చిత్రానికి సంబంధించిన స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. వినోదం, ఉత్సవం, గందరగోళం అనే అంశాల చుట్టూ ఈ కథ తిరగనున్నట్లు చిత్రబృందం పేర్కొంది. కానీ ఈ మూవీ టైటిల్‌ను మాత్రం సస్పెన్స్‌లో ఉంచారు మేకర్స్.
విడుదలైన పోస్టర్‌లో రామ్ నితిన్ ఒక బోర్డు పట్టుకుని కనిపిస్తుండగా, దానిపై ‘జనవరి 9/10/11 కలర్స్ 2k 26’ తేదీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. విశేషం ఏమిటంటే.. ఆ బోర్డు కింద "మీసాల రాజు మిలిటరీ హోటల్ - కాకినాడ" అని రాసి ఉండటం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. దీన్ని బట్టి సినిమా కాకినాడ నేపథ్యంలో సాగే సందడిగా ఉండే కథ అని అర్థమవుతోంది. ఈ చిత్రాన్ని వెంకట్ నిమ్మలపూడి దర్శకత్వంలో తెరకెక్కిస్తుండగా, ధీరజ్ మోగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ec2 టాకీస్ బ్యానర్లపై ధీరజ్ మోగిలినేని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు స్నిజిత్ యర్రమిల్ సంగీతం అందిస్తున్నారు. ‘గందరగోళంలో ఉత్సవం.. వినోదంలో గందరగోళం’ అంటూ సాగే ఈ క్రేజీ ప్రాజెక్ట్ రామ్ నితిన్ కెరీర్‌లో మరో హిట్‌గా నిలుస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఈ బర్త్‌డే పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ అవుతోంది.






