- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పల్లెబాట పట్టిన ఓటర్లు.. సిటీ సరిహద్దుల్లో భారీగా ట్రాఫిక్ జామ్
రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల తొలివిడత పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 9గంటల వరకు 19.58 శాతం పోలింగ్ నమోదైంది.

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల తొలివిడత పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 9గంటల వరకు 19.58 శాతం పోలింగ్ నమోదైంది. కాగా నేడు పోలింగ్ కావడంతో హైదరాబాద్ లో ఉంటున్న పల్లెజనం సొంతూళ్లకు పయనం అవుతున్నారు. ఈ క్రమంలో నగరం సరిహద్దుల్లో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల ప్రజలు భారీగా తరలివెళుతుండడంతో చౌటుప్పల్ దగ్గర హైవేపై భారీగా వాహనాలు దర్శనం ఇస్తున్నాయి.
మరోవైపు ఆర్టీసీ బస్సుల్లో, ప్రైవేటు వాహనాల్లోనూ ప్రజలు తరలివెళుతుండటంతో బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. ఎల్బీనగర్ పరిసర ప్రాంతాల్లోనూ ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ఎల్బీనగర్ లో భారీగా ట్రాపిక్ జామ్ నెలకొంది. అంతే కాకుండా హయత్ నగర్ నుండి వనస్థలిపురం, భాగ్యలత వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇదిలా ఉంటే ఇక హైదరాబాద్ కు దూరంగా ఉన్న జిల్లాల ప్రజలు ఇప్పటికే బస్సుల్లో, ట్రైన్లలో ఇతర ప్రైవేటు వాహనాల్లో తమ సొంతూళ్లకు బయలుదేరారు.
Read More..
భద్రాద్రి కొత్తగూడెం-మణుగూరు ZPHS పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత






