తమిళనాడు ఎన్నికల్లో స్టార్ కంపెయినర్‌గా CM రేవంత్.. మరో ఇద్దరు అగ్రనేతలు కూడా..

by Gantepaka Srikanth |   (  Updated:2026-04-07 12:14:13  IST  )

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏఐసీసీ (AICC), తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నాయకులను రంగంలోకి దించింది.

తమిళనాడు ఎన్నికల్లో స్టార్ కంపెయినర్‌గా CM రేవంత్.. మరో ఇద్దరు అగ్రనేతలు కూడా..
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏఐసీసీ (AICC), తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నాయకులను రంగంలోకి దించింది. తమిళనాడులో డీఎంకే (DMK)తో పొత్తులో భాగంగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలను 'స్టార్ కంపెయినర్లు'గా నియమిస్తూ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా, పార్టీ వ్యూహరచనలో కీలకమైన బాధ్యతలను కూడా ఏఐసీసీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అప్పగించింది. తమిళనాడులో కాంగ్రెస్ పోటీ చేస్తున్న మొత్తం 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, 12 నియోజకవర్గాలకు సీనియర్ అబ్జర్వర్‌గా ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవహరించనున్నారు. అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలు, బూత్ స్థాయి పర్యవేక్షణ వంటి కీలక అంశాలను ఆయన పర్యవేక్షించనున్నారు.

ఎన్నికల నగారా..

తమిళనాడు అసెంబ్లీకి ఈ నెల 23న (ఏప్రిల్ 23, 2026) పోలింగ్ జరగనుంది. డీఎంకే-కాంగ్రెస్ కూటమి ఈ ఎన్నికల్లో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిల నాయకత్వ పటిమ, తమిళనాడు ఎన్నికల్లోనూ కూటమికి కలిసి వస్తుందని అధిష్టానం భావిస్తోంది. ఈ నాయకుల రాకతో తమిళనాడులో కాంగ్రెస్ ప్రచారంలో జోరు పెరగడమే కాకుండా, కార్యకర్తల్లో నూతనోత్సాహం నిండుతుందని పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

‘మీ భాష స్థాయికి తగ్గట్లు లేదు’.. కేరళ సీఎంకు రేవంత్ రెడ్డి కౌంటర్

Next Story