- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు మాజీ సీఎం కేసీఆర్ బర్త్ డే.. స్పెషల్ విషెస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మాజీ సీఎం, ప్రధాన ప్రతిపక్ష నాయకులు కేసీఆర్ (KCR) జన్మదినం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా స్పెషల్ విషెస్ చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారు నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ, రాష్ట్రాభివృద్ధికి తమ వంతు కృషిని కొనసాగించాలని కోరుకుంటున్నా. భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మనసారా ఆకాంక్షిస్తున్నా’ అంటూ సీఎం కార్యాలయం ట్వీట్ చేసింది. మరోవైపు కేసీఆర్ జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ శ్రేణుల్లో పండుగ వాతావరణం నెలకొంది. తెలంగాణ భవన్‌తో పాటు జిల్లా కేంద్రాల్లో ఆయన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరిపేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.
నేడు ముంబై, రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి: కాసేపట్లో మున్సిపల్ శాఖపై కీలక సమీక్ష
Next Story






