- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు ముంబై, రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి: కాసేపట్లో మున్సిపల్ శాఖపై కీలక సమీక్ష
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు ముగియడంతో ఇవాళ సచివాలయంలో మున్సిపల్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించనున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మరోసారి బిజీ షెడ్యూల్‌తో పర్యటనలు చేపట్టనున్నారు. సచివాలయంలో కీలక సమీక్ష ముగిసిన అనంతరం ఆయన ముంబై (Mumbai), ఢిల్లీ (Delhi) పర్యటనలకు వెళ్లనున్నారు. ఇవాళ మధ్యాహ్నం2 గంటలకు సెక్రటేరియట్‌లో సీఎం మున్సిపల్ శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఇటీవల ముగిసిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల పురోగతిపై ఆయన అధికారులతో చర్చించనున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరాభివృద్ధికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
రాత్రి ముంబైకి పయనం..
సచివాలయంలో సమీక్ష ముగిసిన తర్వాత అనంతరం రేవంత్ రెడ్డి రాత్రి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ముంబైకి పయనమవుతారు. రాత్రికి ఆయన ముంబైలోనే బస చేస్తారు. రేపు ముంబైలో జరగనున్న ప్రతిష్టాత్మక ‘క్లైమేట్ వీక్’ (Climate Week) కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. పర్యావరణ పరిరక్షణ, గ్రీన్ ఎనర్జీ, సుస్థిర అభివృద్ధిపై ఈ సదస్సులో ఆయన ప్రసంగించనున్నారు. ఆ కార్యక్రమం ముగిసిన వెంటనే, రేపు సాయంత్రం ముంబై నుంచి నేరుగా దేశ రాజధాని ఢిల్లీకి చేరుకుంటారు. ఎల్లుండి కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఓ అధికారిక కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ నిధులు, విభజన హామీలు, అభివృద్ధి ప్రాజెక్టుల విషయంలో కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉంది.






