- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మేడారం మహా జాతరకు ముహూర్తం ఫిక్స్.. 19న గద్దెలు, ప్రాంగణ పునరుద్ధరణ ప్రారంభోత్సవం
తెలంగాణ ప్రజల కొంగుబంగారం మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర-2026 (Medaram Sammakka-Saralamma Maha Jatara-2026)కు ముహూర్తం ఖరారైంది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రజల కొంగుబంగారం మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర-2026 (Medaram Sammakka-Saralamma Maha Jatara-2026)కు ముహూర్తం ఖరారైంది. ఇందులో భాగంగా జనవరి 19న అమ్మవారి గద్దెలు, ప్రాంగణ పునరుద్ధరణ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొననున్నారు. జనవరి 28న మహా జాతర ప్రారంభమై జనవరి 31న అంటే నాలుగు రోజుల పాటు కొనసాగనుంది. 28న సారలమ్మ దేవత గద్దెకు ఆగమనం, 29న సమ్మక్క దేవత గద్దెకు ఆగమన కార్యక్రమాలు జరగనున్నాయి. ఇక 30న భక్తులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకోనున్నారు. 31న సాయంత్రం 4 గంటల సమయంలో తిరిగి అమ్మవార్లు వన ప్రవేశం చేయనున్నారు. ఇప్పటికే ములుగు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మహా జాతరకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Read More..






