- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇక మాట్లాడేది ఏం లేదు.. కవిత సస్పెన్షన్‌పై కేటీఆర్ షాకింగ్ రిప్లై
బీఆర్ఎస్ (BRS) పార్టీ నుంచి కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) సస్పెన్షన్.. తెలంగాణ పాలిటిక్స్‌లో చర్చనీయాంశంగా మారింది.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ (BRS) పార్టీ నుంచి కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) సస్పెన్షన్.. తెలంగాణ పాలిటిక్స్‌లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఆయా పార్టీలు ఈ విషయంపై రకరకాలుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కవిత వెనుక సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఉండి కథ నడిపిస్తున్నాడని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తుంటే.. మరోవైపు హరీశ్‌రావు, సంతోష్ రావులు సీఎం రేవంత్ రెడ్డితో చేతులు కలిపారంటూ కవిత సంచలన ఆరోపణలు చేస్తున్నారు.
సోషల్ మీడియా వేదికగా ఆమె రోజుకో సంచలన విషయాన్ని బయటపెడుతూ.. బీఆర్ఎస్ పార్టీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇవాళ తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత సస్పెన్షన్‌పై ఓ జర్నలిస్ట్ కేటీఆర్‌ను ప్రశ్నించగా.. ఆయన ఆసక్తికర సమాధానం చెప్పారు. కవిత సస్పెన్షన్ విషయం పార్టీలో చర్చించి తీసుకున్నదని స్పష్టం చేశారు. పార్టీకి నష్టం చేకూర్చిన ప్రతి ఒక్కరికీ ఇదే రూల్ వర్తిస్తుందని తెలిపారు. కవితపై చర్చలు తీసుకున్నాక ఇక మాట్లాడేది ఏం లేదని కేటీఆర్ సూటిగా సమాధానం చెప్పారు.
Read More..






