వెనక్కి తగ్గే ముచ్చటే లేదు.. కల్వకుంట్ల కవిత హాట్ కామెంట్స్

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-08 10:38:26  IST  )

ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ (Congress Party) బీసీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా మోసం చేస్తోందని మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) తీవ్ర ఆరోపణలు చేశారు.

వెనక్కి తగ్గే ముచ్చటే లేదు.. కల్వకుంట్ల కవిత హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ (Congress Party) బీసీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా మోసం చేస్తోందని మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) తీవ్ర ఆరోపణలు చేశారు. ఇవాళ బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో 70కి పైగా బీసీ కులాల నాయకులతో ఆమె భేటీ అయ్యారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు.

ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ (BC Declaration) అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi), ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) ఇంత వరకు తెలంగాణ బీసీల రిజర్వేషన్ల అంశాన్ని ఎందుకు పార్లమెంట్‌ (Parliament)లో ప్రస్తావించలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్ధల ఎన్నికలు నిర్వహించాలని కామెంట్ చేశారు. బీసీ సంఘాలను కలుపుకుని ప్రభుత్వం‌పై ఒత్తిడి తెచ్చేలా ఉద్యమ కార్యాచణ రూపొందిస్తామని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.

Read More..

ఇక మాట్లాడేది ఏం లేదు.. కవిత సస్పెన్షన్‌పై కేటీఆర్ షాకింగ్ రిప్లై

Next Story