అసెంబ్లీలో దుమారం.. పాడి కౌశిక్ రెడ్డికి పదవీ గండం?

by Prasad Jukanti |   (  Updated:2026-03-29 08:38:46  IST  )

అసెంబ్లీలో కడియం శ్రీహరి పట్ల పాడి కౌశిక్ రెడ్డి ప్రవర్తనపై దుమారం చెలరేగింది. ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.

అసెంబ్లీలో దుమారం.. పాడి కౌశిక్ రెడ్డికి పదవీ గండం?
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) వైఖరిపై శాసనసభలో దుమారం చెలరేగింది. కడియం శ్రీహరి పట్ల కౌశిక్ రెడ్డి అనుచితంగా ప్రవర్తించారని ఆయనపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. కడియం శ్రీహరి మాట్లాడుతుండగా కౌశిక్ రెడ్డి బెదిరించారని, గన్‍తో కాల్చి పడేస్తానని కౌశిక్ చేయితో సైగల్ చేశారనే ఆరోపణలు రావడంతో కౌశిక్ రెడ్డి వీడియో పరిశీలించి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పీకర్‍ను కోరారు. కౌశిక్‍రెడ్డిని ఎమ్మెల్యేగా బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం సీరియస్:

కౌశిక్ రెడ్డి తీరుపై ప్రభుత్వం సీరియస్ చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉండగా అసెంబ్లీ సమావేశాల సమయంలోహెడ్ ఫోన్స్ విసిరి దాడి చేశారనే ఆరోపణలపై ప్రతిపక్ష సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ సభ్యత్వాన్ని స్పీకర్ రద్దు చేశారు. అనంతరం వీరు హైకోర్టును ఆశ్రయించగా వీరి సభ్యత్వాల రద్దు చెల్లదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. తాజాగా పాడి కౌశిక్ రెడ్డి విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది అనేది ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ కోరుతున్నట్లు పదవి నుంచి బర్తరఫ్ చేసే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

కౌశిక్ రెడ్డికి షాక్.. ఎథిక్స్ కమిటీ సిఫార్సుకు అసెంబ్లీ తీర్మానం

Next Story