కవిత ‘జనం బాట’ యాత్ర షురూ.. కాసేపట్లో అమరవీరుల స్తూపానికి నివాళులు

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-25 06:25:19  IST  )

తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) నేటి నుంచి ‘జాగృతి జనం బాట’ (Jagruthi Janam Baata)లో కార్యక్రమం ప్రారంభమైంది.

కవిత ‘జనం బాట’ యాత్ర షురూ.. కాసేపట్లో అమరవీరుల స్తూపానికి నివాళులు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) నేటి నుంచి ‘జాగృతి జనం బాట’ (Jagruthi Janam Baata)లో కార్యక్రమం ప్రారంభమైంది. మొత్తం 4 నెలల పాటు ప్రజలతో మమేకమయ్యేలా కార్యాచరణను సైతం రూపొందించున్నారు. మేధావులు, ప్రజల నుంచి విలువైన సలహాలు, సూచనలు తీసుకుని తన భవిష్యత్తు కార్యచరణతో పాటు ప్రజలు కోరుకుంటే కొత్త పార్టీని పెట్టేందుకు సిద్ధమని ఆమె ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. మరికాసేపట్లో గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి కవిత నివాళులర్పించనున్నారు. అక్కడి నుంచి నేరుగా తాను ఎంపీగా గెలుపొందిన నిజామాబాద్‌ నియోజకవర్గ పరధిలోని ఇందల్వాయికి చేరుకోనున్నారు. అక్కడ జాగృతి కార్యాలయం వద్ద ప్రజలను ఉద్దేశించి కవిత ప్రసంగిస్తారు.

Read More..

Kavitha: అమరవీరులు, ఉద్యమకారులకు కవిత బహిరంగ క్షమాపణలు

Next Story