- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముగిసిన మావోయిస్టుల శకం.. ఇవాళ సీఎం ఎదుట అగ్రనేత గణపతి సరెండర్!
దశాబ్దాల మావోయిస్టుల పోరాటానికి తెర పడనుంది. అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు (గణపతి) సహా 124 మంది ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఎదుట లొంగిపోనున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో భద్రతా పరంగా చారిత్రాత్మక పరిణామం చోటుచేసుకోబోతోంది. దశాబ్దాల కాలంగా అడవిని నమ్ముకుని పోరాడుతున్న మావోయిస్టులు భారీ సంఖ్యలో జనజీవన స్రవంతిలో కలవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు తెలంగాణ పోలీసులు (Telangana Police) మావోయిస్టుల లొంగుబాటును అధికారికంగా ప్రకటించనున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రత్యేకంగా ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు.
ఈ సమావేశంలోనే మావోయిస్టుల లొంగుబాటు ప్రక్రియను ముఖ్యమంత్రి స్వయంగా వెల్లడించనున్నారు. ఇందులో భాగంగా మావోయిస్టు పార్టీ మాజీ దళపతి, అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణ రావు (Muppalla Lakshmana Rao) అలియాస్ గణపతి (Ganapathy) ఇవాళ సీఎం ఎదుట లొంగిపోనున్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు మరో 124 మంది వివిధ స్థాయిలకు చెందిన మావోయిస్టు నాయకులు, కమాండర్లు, సభ్యులు కూడా లొంగిపోనున్నారు. ఇందులో మావోయిస్టు పార్టీ అగ్రనేత దేవ్‌జీకి చెందిన పీఎల్జీఏ (People's Liberation Guerrilla Army) విభాగానికి చెందిన వారు కూడా ఉండటం గమనార్హం.
గణపతి సరెండర్‌ను ముందే బ్రేక్ చేసిన ‘దిశ’..
అగ్రనేత గణపతి లొంగిపోతున్నారనే విషయాన్ని పతాక శీర్షికతో అందరి కంటే ముందే ‘దిశ’ గురువారమే వెల్లడించింది. ఈ క్రమంలో మావోయిస్టుల లొంగుబాటుపై స్వయంగా ముఖ్యమంత్రి ప్రెస్‌మీట్ నిర్వహిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ పోలీసులు గత కొంతకాలంగా మావోయిస్టులను జనజీవన స్రవంతిలోకి తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నాలు సంపూర్ణ ఫలితాలను ఇస్తున్నాయి. ఇంత పెద్ద సంఖ్యలో అగ్రనేతలతో సహా లొంగిపోవడం రాష్ట్ర చరిత్రలో కీలక మలుపుగా మారనుంది. లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరపున అందే పునరావాస ప్యాకేజీల గురించి ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ శివధర్ రెడ్డిలు ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా సమావేశమైన విషయం తెలిసిందే.
‘జనజీవన స్రవంతిలోకి రండి’.. మావోయిస్టు అగ్రనేత గణపతికి CM రేవంత్ పిలుపు
- Tags
- Telangana Maoist surrender
- CM Revanth Reddy press meet today
- Maoist leader Ganapathy surrender news
- Muppala Lakshmana Rao alias Ganapathy
- Telangana DGP Shivadhar Reddy
- Maoist rehabilitation package Telangana
- PLGA members surrender
- Telangana internal security update
- Maoist party leaders surrendering in Hyderabad
- Telangana government news
- Left Wing Extremism Telangana
- Latest news on Maoists






