- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Municipal elections: బీ ఫామ్స్ అమ్ముకుంటున్న కొత్త పార్టీ నేత? మున్సిపల్ ఎన్నికల వేళ దుమారం
తెలంగాణలో త్వరలో ఏర్పడబోయే కొత్త పార్టీ నేతలపై మున్సిపల్ ఎన్నికల వేళ బీ-ఫామ్ కోసం డబ్బులు డిమాండ్ చేశారనే ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఆలులేదు సూలులేదు.. కానీ తెలంగాణలో కొత్తగా ఏర్పడబోయే పార్టీ (New Political Party Telangana) అప్పుడే వసూళ్ల దందా మొదలుపెట్టినట్లు ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. మరో పార్టీతో కలిసి పురపోరులో బరిలోకి దిగుతామని ఆ పార్టీ చీఫ్ ఇటీవలనే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనతో రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది ఆశావాహులు మున్సిపల్ ఎన్నికల బరిలో పోటీకి సిద్ధమయ్యారు. అనుకున్నట్లుగానే ఆయా జిల్లాల్లో నామినేషన్లు సైతం దాఖలు చేశారు. అయితే నామినేషన్లు వేసి బీ- ఫామ్‍ల (B-Form) వరకు వచ్చేసరికి ఆ పార్టీ నేతల అసలు రంగు బయటపడుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సదరు పార్టీ అభ్యర్థులు బీ-ఫామ్ కోసం డబ్బులు డిమాండ్ చేస్తున్నారని తాజాగా ఆరోపణలు రాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కాసులిచ్చిన వారికే బీ ఫామ్!:
జరుగుతున్న ప్రచారం ప్రకారం త్వరలో కొత్తగా పురుడుపోసుకోబోతున్న సదరు పార్టీ ఇప్పటికే ఉన్న మరో పార్టీతో కలిసి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. పలువురు అభ్యర్థులను సైతం బరిలో నిలిచేలా ప్రోత్సహించింది. నల్గొండ మున్సిపాలిటీలోని ఓ వార్డుకు సంబంధించి ఇలాగే ఓ అభ్యర్థికి బీ-ఫామ్ ఇస్తామని నామినేషన్ వేయించారని. తీరా బీ-ఫామ్ అడిగితే తమకు రూ.2 లక్షలు ఇస్తేనే పార్టీ టికెట్ ఇస్తామని ఇప్పుడు చెబుతున్నారని సదరు అభ్యర్థి ఆవేదన వ్యక్తం చేశారు. కింది స్థాయి నేతల వసూళ్ల పర్వం కొత్తగా రాబోతున్న పార్టీ అధినేతకు తెలియదేమో అని భావించి సదరు అభ్యర్థి ఈ విషయాన్ని నేరుగా పార్టీ చీఫ్‍కే చెప్పి బీ-ఫామ్ తీసుకుందామని భావించి హైదరాబాద్‍కు రాగా అక్కడ ఆ అధినేతను కలిసేందుకు ఆ పార్టీ నేతలు అనుమతి ఇవ్వలేదని తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. తనకు రూ.2 లక్షలు డిమాండ్ చేసి, రూ.3 లక్షలు ఇచ్చిన మరో వ్యక్తికి బీ-ఫామ్ ఇచ్చినట్లు ప్రచారం సదరు అభ్యర్థి ఆరోపించారు.
ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఇంకెలానో?:
ఈ విషయాలు సదరు పార్టీ చీఫ్ కు తెలియవచ్చు తెలియకపోవచ్చని తెలియకుండానే ఇదంతా జరుగుతుంటే మీకు తెలియకుండానే పార్టీలోని కింది స్థాయి నేతలు బీ ఫామ్ లు అమ్ముకుంటుంటే అది మీ అసమర్థత కాదా అని ప్రశ్నించాడు. మిమ్మల్ని నమ్ముకుని ప్రజలు, కార్యకర్తలు ముందుకు వస్తే వారి పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించాడు. ఆరంభంలోనే రూ. 2 లక్షలు డిమాండ్ చేస్తే రాబోయే రోజుల్లో ప్రజలకు ఎలా అండగా ఉంటారని నిలతీశారు. మొత్తంగా త్వరలోనే కొత్త పార్టీని స్థాపించి రాష్ట్ర రాజకీయాలను శాసించబోతున్నామని ధీమా వ్యక్తం చేస్తున్న సదరు అగ్రనేత టీమ్ లోని సభ్యులపై ఇలాంటి ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. మరి ఈ వ్యవహారంపై సదరు అధినేత ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.






